బంగాళాఖాతంలో ఆవర్తనం: ఏపీలో భారీ వర్షాలు- ప్రత్యేకించి ఈ జిల్లాల్లో

Bay of Bengal: బంగాళాఖాతాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరింత విస్తరిస్తోన్నాయి. ఈ సాయంత్రానికి దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్ రీజియన్, బంగాళాఖాతం దక్షిణ- మధ్య ప్రాంతం, ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి.

అదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది తమిళనాడు ఉత్తర ప్రాంతం దిశగా కదులుతోందని వివరించింది. ఫలితంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ లల్లో ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెన్నైలోని రీజినల్ ఐఎండీ డైరెక్టర్ బీ అముద తెలిపారు.

Orange and Yellow alert for Andhra due to low pressure in Bay of Bengal

బంగాళాఖాతం నైరుతి ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్కులేషన్ ఏర్పడిందని, దీని ప్రభావంతో తమిళనాడులో రాబోయే రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆమె అన్నారు. ఈ నెల 21వ తేదీ నాటికి అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, 22న అల్పపీడనంగా మారుతుందని అన్నారు.

ఇది తమిళనాడు ఉత్తర ప్రాంతం దిశగా కదులుతుందని వివరించారు. ఫలితంగా- చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, ఉలుంతూర్ పేట, మైలాడుథురై సహా ఉత్తర ప్రాంతంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. నీలగిరి, కోయంబత్తూర్, తిరుప్పూర్, థేని, దిండిగల్, ఈరోడ్, కృష్ణగిరి, ధర్మపురి జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తిరుపత్తూరు, వెల్లూరు, తిరువణ్ణామలై, సేలం, కరూర్, నామక్కల్, తిరుచిరాపల్లి జిల్లాల్లో ఈ నెల 24వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు

దీని ప్రభావం ఏపీపైనా పడింది. తమిళనాడు ఉత్తర ప్రాంతానికి ఆనుకుని ఉన్న ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వారం రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉందని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకావం ఉందని తెలిపింది.

వచ్చే 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. బాపట్ల, నంద్యాల, అన్నమయ్య రాయచోటి, శ్రీసత్యసాయి పుట్టపర్తి, అనంతపురం, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+