వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నూలులో మొహర్రం వేడుకల్లో అపశ్రుతి .. గోడకూలి 20 మందికి గాయాలు .. పలువురు సీరియస్

|
Google Oneindia TeluguNews

నేడు దేశ వ్యాప్తంగా మహమ్మదీయులు మొహర్రం పండుగను జరుపుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో మొహర్రం వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. బి.తాండ్రపాడులో పీర్ల చావిడి దగ్గర మొహరం పండుగ సందర్భంగా ప్రత్యేకంగా జరుగుతున్న కార్యక్రమాన్ని చూడడానికి వచ్చిన ముస్లింలు ఒక భవనం పైన పిట్ట గోడ మీద కూర్చున్నారు. ఒక్కసారిగా పిట్టగోడ కూలిపోవడంతో 20 మందికి పైగా కిందపడిపోయారు. దీంతో వారు గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్ధితి విషమంగా ఉంది. గాయపడిన వారందర్నీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

మొహరం పండుగ సందర్భంగా నిప్పుల గుండాన్ని తొక్కుతున్న దృశ్యం చూసేందుకు భారీ సంఖ్యలో జనం పక్కనే ఉన్న ఇంటి మేడపై ఉన్న పిట్టగోడ మీద గుమిగూడారు. పిట్టగోడ చిన్నది కావడంతో ఒక్కసారిగా కూలిపోయింది.

Over 20 injured in Muharram celebrations in Kurnool

వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స జరుగుతోంది. అయితే అందులో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా వున్నట్టు వైద్యులు చెబుతున్నారు. పండగ రోజు చోటుచేసుకున్న సంఘటన తో కర్నూలులో ముస్లింలలో పండుగ సంతోషం కనిపించటం లేదు.

English summary
Moharram celebrations in Kurnool district have been defiled. More than 20 people were injured when a group of Muslims came to see a special fire pit during the Moharram festival near Pirla Chavadi in B.Thandrapadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X