ఆర్జీవీ కుటుంబంలో విషాదం -కరోనాతో ఆయన సోదరుడు సోమశేఖర్ కన్నుమూత -తల్లికి సాయం చేసి..

సినీ పరిశ్రమలో మరో మరణం చోటుచేసుకుంది. దిగ్గజ దర్శకుడు రాంగోపాల్ వర్మ కుటుంబంలో విషాదం నెలకొంది. దర్శకుడు, నిర్మాత అయిన పి. సోమశేఖర్ కరోనాతో కన్నుమూశారు. ఆయన ఆర్జీవీకి వరుసకు సోదురుడు అవుతారు. కరోనా సోకడంతో కొద్ది రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న సోమశేఖర్ ఆదివారం తుదిశ్వాస విడిచారు.

వర్మ సోదరుడిగా చిత్రసీమలో అడుగుపెట్టిన సోమశేఖర్.. రంగీలా, దౌడ్, సత్య కంపెనీ సినిమాలకు ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వర్తించారు. హిందీలో 'ముస్కురాకే దేఖ్ జరా' అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. తర్వాతి కాలంలో సినిమాయేత వ్యాపారాలతో వర్మకు దూరంగా ఉండిపోయారు.

P Som Shekar, Ram Gopal Varma’s cousin passes away in Hyderabad due to Covid-19

తన జీవితంలో కీలకమై వ్యక్తులలో సోమశేఖర్ ఒకరని.. అతడిని చాలా మిస్ అవుతున్నానని ఆర్జీవి పలు ఇంటర్వ్యూల్లో వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. సోమశేఖర్ మృతిపై బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ విచారం వ్యక్తం చేశారు.

సోమశేఖర్ మరణ వార్త విని ఎంతో షాక్ అయ్యానని, కరోనా సొకిన తల్లికి సేవలు చేస్తూ శేఖర్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యాడని, తల్లిని కాపాడుకోగలిగినా, ఆయన మాత్రం ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని బోనీ కపూర్ తెలిపారు. శేఖర్ ఆత్మకు శాంతి చేకూరాలని బోనీ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+