రామోజీరావుకు పద్మవిభూషణ్, సానియా, సైనాలకు పద్మభూషణ్ అవార్డులు, బాబు, కెసిఆర్ హర్షం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను సోమవారం ప్రకటించింది. ప్రముఖ నటుడు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, రామోజీ సంస్థల ఛైర్మన్ రామోజీరావులకు పద్మవిభూషణ్ అవార్డు వరించింది. పత్రికా రంగంలో విశేష కృషి చేసినందుకు రామోజీ రావుకి ఈ అవార్డు దక్కింది.
వీరితోపాటు నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి, ధీరూబాయ్ అంబానీ(మరణానంతరం), సంగీత విద్వాంసురాలు గిరిజాదేవి, శ్రీశ్రీ రవిశంకర్, జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్ జగ్మోహన్, విశ్వనాథన్ శాంత, డా. వాసుదేవ్ కులకుంటె ఆత్రే, అవినాశ్ దీక్షిత్(భారత సంతతి) అవార్డు వరించింది. ఈ ఏడాది పది మందికి పద్మవిభూషణ్ అవార్డు దక్కింది.

పద్మభూషణ్:
సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి
సానియా మీర్జా, టెన్నిస్ క్రీడాకారిణి
యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్
ఉదిత్ నారాయణన్
వినోద్ రాయ్(మాజీ కాగ్)
హేస్నమ్ కన్హయిలాల్
ఎన్ఎస్ రామనుజ తాతాచార్య
బరిందర్ సింగ్ హమ్దర్ద్
డి. నాగేశ్వర్ రెడ్డి
స్వామి తేజోమయానంద
రాబర్ట్ డి బ్లాక్‌విల్(భారత యూఎస్ మాజీ అంబాసిడర్)
ఇందూ జైన్
రవిచంద్ర భార్గవ
రాం వి సుతార్
హఫీజ్ కాంట్రాక్టర్
వెంకట్ రామారావు ఆళ్ల
బ్రిజేందర్ సింగ్
పద్మ శ్రీ:
ఉజ్వల్ నికమ్(సీనియర్ లాయర్)
అజయ్ దేవగన్, బాలీవుడ్ నటుడు
ప్రియాంక చోప్రా, బాలీవుడ్ నటి
ఎస్ఎస్ రాజమౌళి(బాహుబలి దర్శకుడు)
మాళిని అవాస్థి, భోజ్‌పురి గాయని
ప్రెడ్రగ్ కె నికిక్(యోగా-సైబీరియా)
హూయి లాన్ ఝాంగ్(యోగా-చైనా)
చంద్రబాబు, కెసిఆర్ హర్షం
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు పద్మవిభూషణ్‌కు ఎంపికకావడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తంచేశారు. తెలుగు పత్రికా రంగాన్ని రామోజీరావు ప్రపంచస్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. పత్రికారంగం, ఎలక్ట్రానిక్ మీడియాలో చరిత్ర సృష్టించారన్నారు.
పద్మ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిజం రంగంలో విశేష సేవలందించిన రామోజీరావుకు పద్మవిభూషణ్ ప్రకటించడం సముచితమన్నారు. వైద్యరంగంలో డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి, క్రీడా రంగంలో సానియా మీర్జా, సైనా నెహ్వాల్‌లకు పద్మభూషణ్ దక్కడం హర్షణీయమన్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications