హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జువెలరీ ఎగ్జిబిషన్ ప్రారంభించిన పద్మాదేవేందర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహిళలు ఎవరైనా ఆభరణాలు ఇష్టపడతారని తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. అందుకు తాను కూడా మినహాయింపేమి కాదని తెలిపారు. అయితే తాను సింపుల్‌గా ఉండే జువెలరీనే ఇష్టపడతానని చెప్పారు. గురువారం నగరంలోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌లో ఏర్పాటు చేసిన ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జువెలరీ ఎగ్జిబిషన్‌ను ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనకు వజ్రాలంటే ఇష్టమని తెలిపారు. అలాగని భారీ డైమండ్ నెక్లెస్‌లు పెట్టుకోవడం కాకుండా మినిమలిస్టిక్‌ తరహాలో ఉండే వాటిని ఇష్టపడతానని తెలిపారు. తనకు జువెలరీ అంటే చాలా ఇష్టమని చెప్పిన పద్మా దేవేందర్ రెడ్డి.. తాను ఆభరణాలు పెట్టుకోవడం కన్నా ఇతరులు పెట్టుకుంటే వాటిని చూసి ఆనందిస్తానని చెప్పారు.

మలబార్ సంస్థ చేస్తున్న ఆర్టిస్ట్రీ షో నగరవాసులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. బాలికలకు విద్యనందించడానికి కృషి చేస్తున్న మలబార్ సంస్థ తెలంగాణ ప్రాంత అభివృద్ధిలో కూడా పాటుపడాల్సిందిగా కోరారు. మలబార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అషర్ మాట్లాడుతూ.. ఆగస్టు 1 నుంచి 10 వరకు ఈ ఆర్టిస్ట్రీ జువెలరీ షోను ఇక్కడ చేస్తున్నట్లు తెలిపారు. సంస్థ రూపొందించిన మైన్, ఎథ్నిక్స్, ఎరా, ప్రెసియా, డివైన్, స్టార్లెట్ కలెక్షన్స్‌ను ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు.

ఎగ్జిబిషన్

ఎగ్జిబిషన్

మహిళలు ఎవరైనా ఆభరణాలు ఇష్టపడతారని తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. అందుకు తాను కూడా మినహాయింపేమి కాదని తెలిపారు. అయితే తాను సింపుల్‌గా ఉండే జువెలరీనే ఇష్టపడతానని చెప్పారు.

ఎగ్జిబిషన్

ఎగ్జిబిషన్

గురువారం నగరంలోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌లో ఏర్పాటు చేసిన ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జువెలరీ ఎగ్జిబిషన్‌ను ఆమె ప్రారంభించారు.

ఎగ్జిబిషన్

ఎగ్జిబిషన్

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనకు వజ్రాలంటే ఇష్టమని తెలిపారు. అలాగని భారీ డైమండ్ నెక్లెస్‌లు పెట్టుకోవడం కాకుండా మినిమలిస్టిక్‌ తరహాలో ఉండే వాటిని ఇష్టపడతానని తెలిపారు.

ఎగ్జిబిషన్

ఎగ్జిబిషన్

తనకు జువెలరీ అంటే చాలా ఇష్టమని చెప్పిన పద్మా దేవేందర్ రెడ్డి.. తాను ఆభరణాలు పెట్టుకోవడం కన్నా ఇతరులు పెట్టుకుంటే వాటిని చూసి ఆనందిస్తానని చెప్పారు.

ఎగ్జిబిషన్

ఎగ్జిబిషన్

మలబార్ సంస్థ చేస్తున్న ఆర్టిస్ట్రీ షో నగరవాసులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. బాలికలకు విద్యనందించడానికి కృషి చేస్తున్న మలబార్ సంస్థ తెలంగాణ ప్రాంత అభివృద్ధిలో కూడా పాటుపడాల్సిందిగా కోరారు.

ఎగ్జిబిషన్

ఎగ్జిబిషన్

మలబార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అషర్ మాట్లాడుతూ.. ఆగస్టు 1 నుంచి 10 వరకు ఈ ఆర్టిస్ట్రీ జువెలరీ షోను ఇక్కడ చేస్తున్నట్లు తెలిపారు.

English summary
Telangana assembly deputy speaker Padma Devender Reddy on Thursday inaugurated jewellery exhibition at Kukatpally, in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X