రాజీనామా చేసినా బుగ్గకారులో పళ్లం, దిగ్విజయ్‌తో భేటీ

సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. పళ్లం రాజు దిగ్విజయ్ నివాసానికి అధికారిక వాహనంలోనే వచ్చారు. మంత్రి పదవికి రాజీనామా చేయటంతో కేంద్ర ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను కూడా వదులుకున్నట్లు గతంలో పళ్లం రాజు, చిరంజీవి, పురందేశ్వరి, కోట్ల సూర్యప్రకాశ రెడ్డి ప్రకటించారు.
మరోవైపు సీమాంధ్రలో ఉద్యమ వేడి చల్లారడం లేదు. రాష్ట్ర పరిరక్షణ సమితి, సమైక్యాంధ్ర జెఎసీల నేతలు ముందుండి సమైక్య ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. కడప జిల్లా వ్యాప్తంగా ఆటోలు, ఎడ్లబండ్లతో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు మండల కేంద్రాల్లో దీక్షలు సాగుతున్నాయి.
మంగళవారం హోరున కురుస్తున్న వర్షంలోనూ నిరసనలు భారీ ఎత్తున జరిగాయి. ముఖ్యంగా ఎన్జీవోలు, ఉపాధ్యాయులు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు పనివేళల అనంతరం నిరసన దీక్షల్లో పాల్గొన్నారు. జిల్లాలతో కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, రాయచోటి, బద్వేల్, జమ్మలమడుగు, రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాల్లో పులివెందుల, కడప, రాయచోటి, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో దీక్షలు, నిరసనలు హోరెత్తాయి.












Click it and Unblock the Notifications