జగన్‌కు ఆస్తులు, కేసుల ఆలోచన తప్ప రాష్ట్రం పట్టదు: మంత్రి పల్లె

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదని రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథ రెడ్డి శుక్రవారం విమర్శించారు. జగన్‌ తీరు తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా ఉందన్నారు.

జగన్ తన ఆస్తులను రక్షించుకోవాలని, తనమీద ఉన్న కేసుల నుంచి తప్పించుకోవాలనే ఆలోచిస్తున్నాడని ఆరోపించారు. అంతేతప్ప ప్రభుత్వానికి సహకరించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఏమాత్రం లేదన్నారు.

తెలుగుజాతి గౌరవాన్ని ఇనుమడింపచేసిన వారి చరిత్రను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠ్యపుస్తకాల్లో పొందుపరుస్తామని ఆయన చెప్పారు. అదేవిధంగా జర్నలిస్టులకు త్వరలో హెల్త్‌ కార్డులు ఇస్తామని, జర్నలిస్టుల సంక్షేమ నిధిని పెంచుతామన్నారు.

Palle Raghunath Reddy blames YS Jagan

కాంగ్రేస్‌ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి: నారాయణ

కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని రాష్ట్ర మంత్రి నారాయణ అన్నారు. నిర్వీర్యమైన అన్ని వ్యవస్థలను సరిచేసి గాడిలో పెట్టేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు.

ఇదే సమయంలో విజయవాడ ఎంపీ కెశినేని నాని చేసిన వ్యాఖ్యలపై నారాయణ స్పందిస్తూ... నాని సూచనలను స్వాగిస్తున్నామని తెలిపారు. అధికారుల విషయంలో నాని చెప్పింది వాస్తవమే అని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రితో చర్చించిన తరువాత అందరూ కలిసి పనిచేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+