వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ జైల్లో ఉన్నా,కిరణ్ పిచ్చోడు: ఏకిపారేసిన పాల్వాయి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Palvai Goverdhan Reddy
హైదరాబాద్: ఆస్తుల కేసులో పదహారు నెలలు జైలులో ఉండి వచ్చినప్పటికీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుద్ధి మారలేదని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సోమవారం మండిపడ్డారు. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు చేయించిన అతను ఓ మనిషేనా అని, అతను కూడా ఓ రాజకీయ నాయకుడా అని మండిపడ్డారు.

విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రాష్ట్రాన్ని, కేంద్రాన్ని, బ్యాంకులను నిండా ముంచారని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రజలు వరదలు, వర్షాలతో అల్లాడుతుండే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు.

వైయస్ జగన్‌ను సీమాంధ్రలో అక్కడి కాంగ్రెసు పార్టీ సమర్థవంతంగా అడ్డుకోనందునే కాంగ్రెసు పార్టీకి స్థానం లేకుండా పోయిందన్నారు. విభజన ప్రకటనకు ముందే కాంగ్రెసు పార్టీ అక్కడ జీరో అయిందన్నారు. ముఖ్యమంత్రి పిచ్చోడని విమర్శలు గుప్పించారు.

విభజనపై కోర్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి ఆయన ఎలా లేఖ రాస్తారని ప్రశ్నించారు. సిడబ్ల్యూసి నిర్ణయాని కంటే ముందు కిరణ్ తాను సమైక్యవాదిని అని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఇప్పుడు ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు.

తిన్నింటివాసాలు లెక్కబెట్టడమే: పొన్నం

సోనియాను జగన్ విమర్శిస్తున్నా సీమాంధ్ర కాంగ్రెసు నేతలు పెదవి విప్పక పోవడం తిన్నింటి వాసాలు లెక్కబెట్టడమేనని కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ వేరుగా అన్నారు. కాంగ్రెసు పార్టీ బి ఫాం ఇవ్వకుంటే ఎంపీలు ఎలా గెలిచే వారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి లగడపాటి చంచాగిరి చేస్తున్నారని ధ్వజమెత్తారు.

English summary
Congress Party senior leader Palvai Goverdhan Reddy on Monday fired at YSRCP chief YS Jaganmohan Reddy and CM Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X