శ్రీ పద్మావతికి శ్రీవారి పంచమి సారె
శ్రీ పద్మావతికి శ్రీవారి పంచమి సారె
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల శ్రీవారి పంచమి సారెను పంపించారు..తిరుచానూరులో జరుగుతున్న అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ముగింపు ఘట్టమైన పంచమి తీర్థం సందర్భంగా అనాధిగా వస్తున్న అచారం ప్రకారం వెదురు గంపలో పసుపు-కుంకుమ, చందనం, పట్టుచీర పెట్టి గర్భాలయంలో స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేకపూజలు చేసి ఊరేగింపుగా కాలినడకన తిరుచానూరుకి తీసుకెళ్లారు.మధ్యహ్నం 12:30 గంటలకు జరిగిన పద్మావతి అమ్మవారి పంచమి తీర్థ పూజ కార్యక్రమంలో పసుపు-కుంకుమ సారెను అర్చకులు అమ్మవారికి అలంకరించారు.












Click it and Unblock the Notifications