పంచాయతీ ఎన్నికలకు సిద్ధంకండి: చంద్రబాబు ప్రభుత్వానికి ఈసీ లేఖ
అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆగస్టులో పంచాయతీల గడువు ముగుస్తుంది. ఆగస్ట్ ఒకటిన పంచాయతీలు ఎన్నికై అయిదేళ్లు అవుతుంది.
ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇదే విషయాన్ని ఈసీ తన లేఖలో వెల్లడించింది. రాజ్యాంగం ప్రకారం కొత్తగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు సంబంధిత ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచించింది.

గ్రామాల్లో ఓటర్ల జాబితా ప్రకటించడం, పోలింగ్ స్టేషన్‌లను గుర్తించడం, వార్డుల్లో రిజర్వేషన్లు ప్రకటించడం, బందోబస్తు తదితర ఏర్పాట్లన్నిటినీ ఈ నెల 15 నుంచి జూన్ 30 లోగా సిద్ధం చేయాలని పంచాయతీ శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు.












Click it and Unblock the Notifications