Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ రద్దుల రెడ్డి..ఆయన జైలుకు వెళ్తే సీఎం కావాలని ఆశపడేది ఆ ముగ్గురే : పంచుమర్తి అనూరాధ

వైసీపీ సర్కార్ పై, వైసీపీ నేతల తీరుపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ పంచ్ లు వేశారు. వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్తే సీఎం కావాలని బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి, రోజా ఆశపడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శలు చేశారు . కావాలనే వీరంతామాజీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు .

సీఎం పదవి కోసమే వారు చంద్రబాబును దూషిస్తున్నారని పేర్కొన్న అనూరాధ ప్రజల ఆస్తులను దోపిడీ చేసిన కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్‌ని ఏమనాలని ఆమె ప్రశ్నించారు.ఇక అంతే కాదు వైసీపీలోనే జగన్ జైలుకు వెళ్తే తాము సీఎం కావచ్చని ఎదురు చూస్తున్న నేతలు ఉన్నారని పేర్కొన్నారు. ఇక కన్నాబాబు వ్యాఖ్యలను తప్పుబట్టిన అనూరాధ పైరవీల కోసమే సచివాలయం అంటూ మంత్రి కన్నబాబు చీప్‌గా మాట్లాడుతున్నారని అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Panchumarthi Anuradha punches on ycp leaders and government

మండలిలో 20మందికి పైగా బడుగు, బలహీనవర్గాల వారే ఉన్నారని, బీసీలను అభివృద్ధి చేస్తామని చెప్పి... వైసీపీ వారి గొంతు కోస్తోందని విమర్శించారు.సీఎం జగన్‌ రద్దుల రెడ్డిగా చరిత్రలో నిలిచిపోతారని ఆమె వ్యాఖ్యానించారు అసెంబ్లీ సాక్షిగా 5కోట్ల మంది ప్రజలను మోసం చేశారని ఆమె విమర్శించారు. మండలి రద్దుపై సీఎం జగన్‌ పునఃసమీక్షించి, వెనక్కి తీసుకోవాలని పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+