హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో సమాంతర ప్రభుత్వం: అచ్చన్న హెచ్చరిక, 'కేసువల్లే కేసీఆర్‌కు జగన్ అండ'

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులో ప్రభుత్వ సంస్థలు, శాంతిభద్రతలు గవర్నర్ చేతిలో లేకుంటే తాము సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతామని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సెక్షన్ 8 అమలు చేయకుంటే హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని తాము డిమాండ్ చేస్తామని చెప్పారు. సెక్షన్ 8 లేకుంటే విభజన చట్టం రద్దు చేసి తెలంగాణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపేస్తారా అని సవాల్ చేశారు.

నిరాహార దీక్షల వల్ల చట్టాలు మారిపోతాయని చెబితే, తాము లక్షలాదిమందితో నిరాహార దీక్ష చేస్తామన్నారు. రాజ్యాంగబద్ధమైన సెక్షన్ 5, 8 అమలు చేయమని చెబుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గవర్నర్ నరసింహన్ బర్తరఫ్ చేయాలన్నారు.

Parallel government in Hyderabad: Achennayudu

సెక్షన్ 8ను అమలు చేసి ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టకుంటే హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని ఉద్యమిస్తామన్నారు. పదేళ్ల కంటే పది నిమిషాల ముందు కూడా హైదరాబాదును తాము ఖాళీ చేయమని చెప్పారు.

కేసులకు భయపడి కేసీఆర్‌తో చేయి కలిపిన జగన్

సెక్షన్ 8 పైన కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని ఎమ్మెల్యే బండారు అన్నారు. జగన్‌ను రాళ్లతో కొట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు. కేసీఆర్‌తో కలిసి జగన్ చేస్తున్న పాపాలు గోదావరిలో మునిగినాపోవని మండిపడ్డారు. సీబీఐ కేసుల నుండి తప్పించుకునేందుకే జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చేతులు కలిపారని ఆరోపంచారు. జగన్‌కు రోజులు దగ్గరపడ్డాయన్నారు.

English summary
Parallel government in Hyderabad: Achennayudu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X