చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

9 నెలల మా అమ్మాయిని చంపేస్తాం, అనుమతివ్వండి: కోర్టుకు పేరెంట్స్

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: లివర్ మార్పిడి చికిత్సకు తగినంత స్థోమత లేకపోవడంతో ఓ చిన్నారి మెర్సీ ల్లింగ్‌కు తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించిన బాధాకరమైన సంఘటన చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. నూతల చెరువు మండలం బత్తలాపురం రైల్వే గేటు వద్ద ఉండే రమనప్ప, సరస్వతి దంపతులకు పాప పుట్టింది.

ఆమె వయస్సు ఇప్పుడు 9 నెలలు. ఆ చిన్నారికి పుట్టినప్పటి నుంచి లివర్ జబ్బు ఉంది. ఆమెను చెన్నైలోని ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. లక్షలు ఖర్చయింది. ఆపరేషన్ విఫలమయింది. ఆ తర్వాత నారాయణ హృదయాలయకు తరలించారు.

Parents petition for mercy killing

చిన్నారికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు రూ.50 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. ఆపరేషన్ అనంతరం నెలకు దాదాపు రూ.60వేలు ఖర్చవుతుందన్నారు. తమకు అంత స్తోమత లేకపోవడంతో కారుణ్య మరణం కోరుతూ తంబళ్లపల్లి కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ స్వీకరించిన కోర్టు హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. తల్లిదండ్రులు హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు.

English summary
Chittoor district Parents petition for mercy killing their 9 months daughter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X