Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో అధికారం ఆ పార్టీదే: తేల్చేసిన పరిపూర్ణానంద స్వామి..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపై పరిపూర్ణానంద స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మరికొన్ని గంటల్లో కౌంటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పరిపూర్ణానంద స్వామీజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని, మరోమరి పాలనా పగ్గాలు చేపడుతుందని పరిపూర్ణానంద స్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. మూడోసారి మోడీ ప్రధాని అవుతారని ఆయన స్పష్టం చేశారు.

ఏపీ ఫలితాలపై పరిపూర్ణానంద స్వామి కీలక వ్యాఖ్యలు
అయితే ఇదే సమయంలో ఏపీ ఫలితాలపైన మాత్రం ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మళ్లీ సీఎంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి వస్తారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 123 స్థానాలు సాధిస్తుందని, ఈ మేరకు తనకు చాలా ముఖ్యమైన వ్యక్తి ద్వారా సమాచారం అందిందని పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. అంతేకాదు హిందూపురం నియోజకవర్గంలో ఎవరు ఊహించని పరిణామం జరగబోతుందని పరిపూర్ణానంద స్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Paripoorananda swami sensation on election results NDA in the country and YCP in AP

ఏపీలో గ్రామీణ మహిళల ఓటు బ్యాంకు ఆ పార్టీకే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల మహిళలు ఎక్కువమంది వైసీపీకే ఓటు వేశారని పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే ఏపీలో ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. కొన్ని సర్వేలు వైసిపి అధికారంలోకి వస్తుందని పేర్కొంటే, మరికొన్ని టిడిపి కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పడంతో ఎగ్జిట్ పోల్స్ విషయంలో క్లారిటీ లేకుండా పోయింది.

పరిపూర్ణానంద వ్యాఖ్యలపై ఏపీలో ఆసక్తి
ఇక రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఎవరికి వారు అధికారంలోకి వచ్చేది తామేనని చెబుతున్న పరిస్థితి ఉంది. ఇక మరికొన్ని గంటల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఏమిటో తేలిపోనుండగా ఈ సమయంలో పరిపూర్ణానంద స్వామి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు పరిపూర్ణానంద స్వామి హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే.

హిందూపురంలో పోటీ చేసిన పరిపూర్ణానంద
బిజెపి నుంచి టికెట్ ఆశించిన ఆయన తెలుగుదేశం జనసేన బిజెపి కూటమిలో భాగంగా హిందూపురం నియోజకవర్గం టిడిపికి వెళ్లడంతో అసంతృప్తికి గురయ్యారు. ఆపై ఆయన స్వతంత్ర అభ్యర్థిగా హిందూపురం నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి బాలకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీఎన్ దీపిక ల పైన పరిపూర్ణానంద స్వామి ఎన్నికల బరిలో పోటీ చేశారు. ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీలో ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+