ఓబులేసుపై పరిటాల శ్రీరాం మాజీ డ్రైవర్ దాడి, తెరపైకి కాబోయే భార్య
అనంతపురం: అనంతపురం జిల్లా రాప్తాడులో బోయ ఓబులేసు అనే వ్యక్తి పైన దాడి ఘటన చర్చకు దారి తీసింది. ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్ వెలుగు చూసింది. పరిటాల శ్రీరాంకు గతంలో కారు డ్రైవర్‌గా పని చేసిన నగేష్‌కు కాబోయే భార్య శృతి మంగళవారం నాడు ఓబులేసు పైన ఎస్పీకి ఫిర్యాదు చేసింది.
గత నాలుగేళ్లుగా తనను ఓబులేసు వేధిస్తున్నాడని, ఆ విషయాన్ని తాను నగేష్ చౌదరికి చెప్పానని, అందువల్లే దాడి చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

ఇటీవల ఓబులేష్ పైన నగేష్ దాడి చేసిన వీడియో స్థానికంగా కలకలం రేపుతోంది. గత ఐదు రోజులుగా ఓబులేసు ఆచూకీ దొరకలేదు. అదే సమయంలో, తాజాగా నగేష్ కాబోయే భార్య శృతి.. ఓబులేసు పైన ఫిర్యాదు చేయడం కొత్త ట్విస్ట్.












Click it and Unblock the Notifications