వెంకయ్య, నందమూరి హరికృష్ణలను కలిసిన సునీత, పెళ్లికి ఆహ్వానం

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: తన తనయుడు పరిటాల శ్రీరామ్‌ వివాహానికి హాజరుకావాలని కోరుతూ ఆయన తల్లి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఆదివారం ఆహ్వానించారు.

ఈ మేరకు హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో వెంకయ్యను కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు.

అలాగే, కేంద్రమంత్రి సుజనా చౌదరి, మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణకూ ఆహ్వాన పత్రికలు అందజేసి శ్రీరామ్‌ వివాహానికి రావాలని కోరారు.

అక్టోబర్ 1న పెళ్లి

అక్టోబర్ 1న పెళ్లి

కాగా, పరిటాల శ్రీరామ్ వివాహం అక్టోబర్ 1వ తేదీన జరగనుంది. శింగనమల నియోజకవర్గం నార్పల మండలంకు చెందిన ఏవీఆర్ కన్‌స్ట్రక్షన్స్ అధినేత ఆలం వెంకటరమణ, సుశీలమ్మల కుమార్తె ఆలం జ్ఞానవిలతో పెళ్లి నిశ్చయమైన విషయం తెలిసిందే.

ఇటీవలే నిశ్చితార్థం

ఇటీవలే నిశ్చితార్థం

హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్‌కన్వెన్షన్‌లో పరిటాల కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానుల మధ్య ఈ నెల 10వ తేదీన వైభవంగా నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

కెసిఆర్‌కూ ఆహ్వానం

కెసిఆర్‌కూ ఆహ్వానం

పరిటాల శ్రీరామ్ - జ్ఞానవిల వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ కలిశారు. ఆయనను పెళ్లికి ఆహ్వానించారు.

శ్రీరామ్‌కు ఆదరణ

శ్రీరామ్‌కు ఆదరణ

కాగా, దివంగత నేత పరిటాల రవి తనయుడైన శ్రీరామ్‌కు అనంతరపురం జిల్లా ప్రజల్లో యువనేతగా మంచి మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో శ్రీరామ్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister Paritala Sunitha and Paritala Sriram met vice president Venkaiah Naidu on Sunday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి