బాలయ్య: ఏపార్టీయో, చంద్రబాబు చెప్పాలని పార్థసారథి
హైదరాబాద్/విజయవాడ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను పెనమలూరు నియోజకవర్గం నుండే పోటీ చేస్తానని అయితే, ఏ పార్టీ తరఫున పోటీ చేస్తానననేది ఇంకా తేల్చుకోలేదని చెప్పారు. తాను తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేదీ లేదని నిర్ణయించేది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడేనని చెప్పారు. అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకుంటానని వ్యాఖ్యానించారు.
కాగా, వచ్చే ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఆ పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ పోటీ చేయనున్నారనే ప్రచారం కొంతకాలంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్థసారథి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పెనమలూరుపై చంద్రబాబు హామీ ఇస్తే టిడిపిలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే, బాలయ్య పోటీ చేస్తారనే దాని పైన స్పష్టత రావాల్సి ఉంది.

కేంద్రమంత్రి జైరామ్ రమేష్ వార్డు మెంబర్‌గా కూడా గెలవలేరని అమలాపురం పార్లమెంటు సభ్యులు హర్ష కుమార్ విమర్శించారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో విలేకరులతో మాట్లాడారు. ఎపి నుండి రాజ్యసభకు వచ్చి జైరామ్ కేంద్రమంత్రివర్గంలో అడ్డంగా దూరిపోయారన్నారు.
రిలయన్స్ సంస్థకు చెందిన ముఖేష్ అంబానీకి ప్రతినిధిగా జైరామ్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు అతడి మాటలు వింటున్నారని, అందుకే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణకు ఏడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ప్రజలే తనకు న్యాయ నిర్ణేతలు అన్నారు. ఎస్సీల వర్గీకరణకు అసెంబ్లీలో మద్దతు తెలిపిన టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల్లో చేరనని చెప్పారు.












Click it and Unblock the Notifications