దగ్గుబాటి కుటుంబం వద్దు.. ఇదేం పద్ధతి: జగన్‌కు సొంత పార్టీ నేతల షాక్
పర్చూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, పర్చూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్న దగ్గుబాటి వెంకటేశ్వర రావు, పురంధేశ్వరిల తనయుడు దగ్గుబాటి హితేష్ చెంచురాంకు షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్పటికే ఆయనకు అమెరికా పౌరసత్వం ఉన్న నేపథ్యంలో దానిని రద్దు చేయించుకున్న తర్వాతే పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంది.

జగన్-దగ్గుబాటి భేటీపై పర్చూరు వైసీపీ కేడర్ తీవ్ర అసంతృప్తి
ఇప్పుడు మరో షాక్ తగులుతోంది. దగ్గుబాటి వెంకటేశ్వర రావు, తనయుడు హితేష్‌లు హైదరాబాదులో తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవడంపై పర్చూరు నియోజకవర్గ వైసీపీ కేడర్ తీవ్ర అసంతృప్తికి గురైనట్లుగా తెలుస్తోంది. జగన్ వారికి కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వడాన్ని వైసీపీ కేడర్ జీర్ణించుకోలేకపోతోంది.

ఎక్కడ అధికారం ఉంటే అక్కడ దగ్గుబాటి ఫ్యామిలీ
దగ్గుబాటి వెంకటేశ్వర రావు, హితేష్ చెంచురాంల రాకను నిరసిస్తూ పర్చూరు రోటరీ భవన్‌లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశమయ్యారు. అధికారం ఎక్కడ ఉంటే దగ్గుబాటి అక్కడ ఉంటారని, పార్టీలో పని చేస్తోన్న వారికి అన్యాయం చేయవద్దని వారు అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. దగ్గుబాటి కుటుంబానికి టిక్కెట్ ఇచ్చే సంప్రదాయం మంచిది కాదన్నారు.

దగ్గుబాటి రాకపై వ్యతిరేకత.. జగన్‌కు ఝలక్
పర్చూరు నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రావి రామనాథం బాబు టిక్కెట్ ఆశిస్తున్నారు. ఈ టిక్కెట్ రామనాథంకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, పార్టీలోకి దగ్గుబాటి రాకను తాము వ్యతిరేకిస్తున్నట్లు పర్చూరు వైసీపీ కేడర్ తెలిపింది. ఓ వైపు దగ్గుబాటి కుటుంబాన్నిజగన్ స్వాగతిస్తంటే, పర్చూరు నియోజకవర్గంలోని కీలక కేడర్ వ్యతిరేకిస్తుండటం వైసీపీకి షాక్ అని చెప్పవచ్చు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications