కాలయాపన దేనికి: ఆ టీడీపీ నేతలపై కేసులు పెట్టండి..సీఎం జగన్‌ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్
Recommended Video
ఏపీలో మూడు రాజధానుల రగడ కొనసాగుతుంది. మూడు రాజధానుల ప్రతిపాదన సీఎం జగన్ మోహన్ రెడ్డి పెట్టిన నాటి నుండీ నేటివరకు అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు ఉద్యమం కొనసాగిస్తూనే వున్నారు. నేటి నుండీ ఉద్యమ తీవ్రతను పెంచాలని నిర్ణయించి సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే రాజధాని అమరావతి విషయంలో రైతుల పక్షాన స్టాండ్ తీసుకున్న పవన్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అంతే కాదు కాలయాపన దేనికి రాజధాని లో ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడితే వారిపై కేసులు నమోదు చెయ్యండి అంటూ సలహా ఇచ్చారు .

ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పడిన వారిపై కేసులు పెట్టమని సలహా ఇచ్చిన పవన్
ఇక ట్విట్టర్ వేదికగా పవన్ జనసేన పార్టీ రాజధాని విషయంలో ప్రభుత్వాన్ని కోరుతున్న డిమాండ్లను లేఖల రూపంలో పోస్ట్ చేశారు. రాజధాని అమరావతిని మార్చొద్దని డిమాండ్ చేస్తున్న ఆయన రాజధాని రైతుల పక్షాన అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ జనసేన పోరాటం చేస్తుందని చెప్పారు. నిజంగా రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే వారెవరో మీకు తెలిస్తే టీడీపీ నేతలపై కేసులు నమోదు చెయ్యకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

ఇన్సైడర్ ట్రేడింగ్ జరిపిన వారి వివరాలు తెలిశాక టైం వేస్ట్ ఎందుకు అని ప్రశ్న
అమరావతి భూ సేకరణలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పారని, పదేపదే చెప్పటం మినహాయించి ఏం చేశారని పవన్ ప్రశ్నించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిపిన వారి వివరాలు గతంలోనే ప్రకటించారు. అధికారం మీ చేతుల్లోనే ఉంది. వారిపై కేసులు నమోదు చేయవచ్చుగా అన్న పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రకటనలతో కాలం వెళ్లబుచ్చుతున్నారని నిలదీశారు . టీడీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారు అని చెప్పిన విషయాన్నే పదే పదే చెబుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు .

గతంలోనూ ఇప్పుడూ రాజధాని రైతుల పక్షానే జనసేన
తానూ గతంలో కూడా రాజధాని రైతులకు అండగా ఉన్నానని , ఇప్పుడు కూడా ఉంటానని చెప్పారు. ఇంకా అంతేకాదు తాను రాజధానికి 33000 ఎకరాలు అవసరమా అని గతంలోనే ప్రశ్నించాను అని చెప్పిన జనసేనాని అప్పుడే రాజధాని భూముల విషయంలో భయపడ్డానని పేర్కొన్నారు. ఒక వేళ ప్రభుత్వం మారితే భూములు ఇచ్చిన రైతుల భవిష్యత్తు ఏమిటని అప్పుడే ఆలోచించానని ఇప్పుడు తాను భయపడ్డదే నిజం అయిందని పవన్ పేర్కొన్నారు . జనసేన డిమాండ్ ఇదే అని చెప్పిన పవన్ పాలన కేంద్రీకృతం కావాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పుకొచ్చారు .

టీడీపీ హయాంలోనూ రాజధాని రైతుల కోసం పోరాడాను .. ఇప్పుడూ పోరాడతా
సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధానిని రాయలసీమలో పెడతారో, ఉత్తరాంధ్రలో పెడతారో స్పష్టంగా ప్రకటించాలి అన్నారు. ముఖ్యమంత్రి, వైసీపీ మంత్రుల వ్యాఖ్యలు చాలా గందరగోళానికి గురి చేస్తున్నాయని పవన్ పేర్కొన్నారు. తనపై విమర్శలు చేసేవారికి ఒక్కటే చెప్పదలచుకున్నానని చెప్పిన పవన్ బలవంతంగా భూములు సేకరిస్తే ఉద్యమిస్తామని నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల పక్షాన పోరాడానని గుర్తు చేశారు.

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒప్పుకున్నారు. ఇప్పుడు బాధ్యత మీదే అన్న పవన్
ఇప్పుడు రాజధాని కోసం తమ భూములను త్యాగం చేసి రోడ్డున పడిన రైతులకు అండగా నిలుస్తున్నాను అని అన్నారు. రాజధాని రైతుల కోసం జనసేన అండగా ఉంటుంది అని చెప్పిన పవన్ ప్రతిపక్షంలో ఉండగా రాజధానికి 30 వేల ఎకరాలు కావాలన్నారు. ఇప్పుడు వద్దంటే ఎలా అని ప్రశ్నించారు. అప్పుడు చెప్పిన మాటకు కట్టుబడి రైతుల బాధ్యత తీసుకోవాలి అని పవన్ డిమాండ్ చేశారు .












Click it and Unblock the Notifications