వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాపై సమరానికి పవన్ పిలుపు .. సాయంత్రం 5గంటలకు జనసేనాని గంటానాదం

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే . కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి , అందరం ఐక్యంగా పోరాటం సాగిస్తున్నాం అని చెప్పటానికి ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ పాటించాలని చేసిన ప్రసంగంపై స్పందించిన పవన్ కళ్యాణ్ జనసైనికులు కరోనాపై పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు . ఇక రేపు జనతా కర్ఫ్యూ పాటించి సాయంత్రం 5 గంటలకు గంటా నాదం చేస్తానని చెప్పారు.

 ప్రజలకు అవగాహన కల్పించాలని క్యాడర్ కు పిలుపు

ప్రజలకు అవగాహన కల్పించాలని క్యాడర్ కు పిలుపు


కరోనా ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పించాలని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ క్యాడర్‌కు పిలుపునిచ్చారు . శనివారం మధ్యాహ్నం జనసేన పార్టీ నాయకులతో పవన్‌కళ్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనా విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించటం సామాజిక బాధ్యత అన్నారు. కరోనా మహమ్మారి నుంచి మనకు మనమే నియంత్రణలు విధించుకోవాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రతి ఒక్కరూ వైద్య నిపుణుల సలహాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని కోరిన పవన్

జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని కోరిన పవన్


కరోనా నియంత్రణపై ప్రజలందరికీ అవగాహన కలిగించడం ఇప్పుడు చాలా అవసరం అని చెప్పిన పవన్ కళ్యాణ్ జనసైనికులు సామాజిక బాధ్యత నిర్వర్తించాలని పేర్కొన్నారు . ఇక ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఎవరికి వారు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని కోరారు. ప్రాణాలు పణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, వైద్యసిబ్బంది.. పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మీడియా వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలన్నారు. రేపు సా.5 గంటలకు ఇంటి బయటకు వచ్చి కరతాళ ధ్వనులతో కృతజ్ఞత చెబుదామని పవన్‌ పేర్కొన్నారు.

రేపు సాయంత్రం హైదరాబాద్ నివాసంలో గంటా నాదం చెయ్యనున్న పవన్

రేపు సాయంత్రం హైదరాబాద్ నివాసంలో గంటా నాదం చెయ్యనున్న పవన్


ఇక రేపు మార్చి 22వ తేదీ సాయంత్రం 5గం.కు పవన్ కళ్యాణ్ గంటా నాదం చెయ్యనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూకి మద్దతుగా హైదరాబాద్ లోని తన నివాసంలో గంట మోగించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 22వ తేదీన ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ లో పాల్గొనాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోరారు. ఆ రోజు సాయంత్రం కరోనా బాధితులకు సేవలు చేస్తున్న వారికి కరతాళ ధ్వనులు ద్వారా కృతజ్ఞతలు చెప్పాలని , అంతే కాదు మనందరి ఐక్యతను చాటాలని కోరారు పవన్ కళ్యాణ్ .

English summary
Janasena chief Power Star Pawan Kalyan urged the people to extend their solidarity to Janatha Curfew. He, himself, took an initiation to stay, himself, in home on March 22. Besides, he arranged a bell in his home. At the stroke of 5 pm on Sunday, he will ring the bell as a token of his gratitude on doctors, para medical staff, police, media and sanitation staff who are working round the clock to prevent the spreading of the virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X