తీరిక లేదు: రాజకీయ నేతలపై పవన్ కల్యాణ్ ఆసక్తికరం

హైదరాబాద్: టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆదివారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గుండె వ్యాధులపై అవగాహన కల్పించేందుకు హృదయ స్పందన ఫౌండేషన్ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వాక్ నిర్వహించింది. నెక్లెస్ రోడ్డులోని పివి ఘాట్ నుండి పీపుల్స్ ప్లాజా వరకు నిర్వహించిన ఈ నడకను పవన్ కల్యాణ్, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలని సూచించారు. ఆరోగ్యం బాగుంటే మంచి ఆలోచనలతో సమాజాన్ని ముందుకు తీసుకు వెళ్లగలమన్నారు. ఆహారపు అలవాట్లలో స్వల్ప మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం ద్వారా గుండె వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చునన్నారు.

Pawan Kalyan interesting comments on Politics

ప్రభుత్వం చేయాల్సిన పనులను స్వచ్చంధ సంస్థలు చేస్తున్నాయంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేతలు, ప్రభుత్వాలకు తీరిక లేకుండా పోతోందని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

కాగా, ఈ వాక్ ఫర్ హార్ట్ రిచ్ ఫర్ హార్ట్ పేరిట ఉదయం ప్రారంభమైన ఈ నడకలో కళాశాల విద్యార్థులు, వైద్యులు, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పవన్ కల్యాణ్‌‌ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు, ఆయనను తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీ పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+