నా అజెండా టాప్ సీక్రెట్ కాదు.. ఇదే.. ఎవ్వరైనా రెడీయే!

వచ్చే ఎన్నికల్లో ఈ తరహా మంత్రులను ఓడించాలంటూ జనసేనాని పిలుపునిచ్చారు.

వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోను తాను అసెంబ్లీలో అడుగుపెట్టడంతోపాటు పదుల సంఖ్యలో జనసేన ఎమ్మెల్యేలను కూడా తీసుకువెళ్లాలనే పట్టుదలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారు. ఇటీవలికాలంలో తరుచుగా పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నవారిలో వైసీపీ ప్రజాప్రతినిధుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉంటున్నారు. ముఖ్యంగా మంత్రులందరి హిట్ లిస్ట్ లో పవన్ కల్యాణ్ ఉన్నారు.

 కచ్చితంగా వీరిని ఓడించాలి

కచ్చితంగా వీరిని ఓడించాలి


ఈ తరహా మంత్రులను వచ్చే ఎన్నికల్లో ఓడించాలనే పట్టుదలను పవన్ చూపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుంటుంది కాబట్టి అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, జోగి రమేష్, రోజా తదితర మంత్రులను వారి వారి నియోజకవర్గాల్లో ఓడించడానికి ఇప్పటినుంచే పవన్ పావులు కదుపుతున్నారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నంతవరకు ఇబ్బంది లేదని, కానీ ప్రత్యర్థి కాస్తా శత్రువుగా బిహేవ్ చేస్తున్నారని, వ్యక్తిగత విమర్శలు చేస్తూ కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగుతున్నారనేది పవన్ కల్యాణ్ ఆరోపణగా ఉంది.

 మంత్రులను ఓడించడానికి పావులు కదుపుతున్న పవన్ కల్యాణ్

మంత్రులను ఓడించడానికి పావులు కదుపుతున్న పవన్ కల్యాణ్


వచ్చే ఎన్నికల్లో ఈ తరహా మంత్రులను ఓడించాలంటూ జనసేనాని పిలుపునిచ్చారు. అందుకనుగుణంగా సత్తెనపల్లిలో అంబటి రాంబాబును ఓడించడానికి తెరవెనక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటంబాలను పరామర్శించేందుకు పవన్ ఇప్పటికే అక్కడ పర్యటించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి నాదెండ్ల మనోహర్ కూడా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో పర్యటించారు.

 పవన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడే కన్నబాబు

పవన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడే కన్నబాబు


మొదటి మంత్రివర్గంలో వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న కురసాల కన్నబాబు పవన్ పై తీవ్రస్థాయిలో మండిపడేవారు. కాకినాడ రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న కన్నబాబు రెండోసారి మంత్రివర్గంలో స్థానం సంపాదించుకోలేకపోయారు. వీలుంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ రూరల్ నుంచి పోటీచేయాలనే ప్రతిపాదన పవన్ కల్యాణ్ ముందు ఉంది. అయితే దీనిపై అధినేత ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కాకినాడ రూరల్ లో కాపు సామాజికవర్గ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఓటర్ల సంఖ్యలో కాపులదే అధిక భాగం అవడంతో ఇక్కడి నుంచి సులువుగా గెలవొచ్చని జనసైనికులు చెబుతున్నారు.

చిరంజీవి కుటుంబానికి సన్నిహితుడు

చిరంజీవి కుటుంబానికి సన్నిహితుడు


చిరంజీవి కుటుంబానికి సన్నిహితుడైన కురసాల కన్నబాబు 2009లో ప్రజారాజ్యం నుంచి విజయం సాదించారు. 2014లో ఇండిపెండెంట్ గా పోటీచేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరి విజయం సాధించారు. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే కాపుల ఓట్లు పోలరైజ్ అవుతాయని భావిస్తున్నారు. ఇక్కడి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేసిన పంతం నానాజీకి 40వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఒకవేళ పవన్ ఇక్కడి నుంచి పోటీచేస్తానంటే నియోజకవర్గం కేటాయించడానికి టీడీపీ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం అక్కడ ఇన్ఛార్జిగా పిల్లి అనంతలక్ష్మి ఉన్నారు. టీడీపీకి సరైన అభ్యర్థి దొరకడంలేదు. ఒకవేళ పవన్ కల్యాణ్ పోటీచేయకపోతే పంతం నానాజీయే పోటీచేస్తారని చెబుతున్నారు. రూరల్ నుంచైతే సులువుగా గెలవొచ్చని, ఇక్కడి నుంచే పోటీచేయాలంటూ పవన్ కల్యాణ్ కు ఆహ్వానాలు అందుతున్నాయి. అధినేత ఏం చేస్తారో చూడాలి మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+