పవన్ కళ్యాణ్ -జగన్ వ్యూహంలో చిక్కుకున్న బాబు? ఆ ఆగ్రహం వెనుక

అమరావతి: తెలుగుదేశం పార్టీ గురువారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. పార్లమెంటులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని చంద్రబాబు నిర్ణయించారు.

చదవండి: టిడిపిని అడిగాం: అవిశ్వాస తీర్మానంపై జగన్, లోకసభ జనరల్ సెక్రటరీకి నోటీసులు

ప్రతిపక్ష వైసీపీ పెట్టే అవిశ్వాస తీర్మానానికి మనం ఎందుకు మద్దతివ్వాలని పలువురు మంత్రులు ఈ భేటీలో ప్రశ్నించగా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి చర్యకు మద్దతిద్దామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వారికి చెప్పారు.

చదవండి: నన్ను అలా అంటారా!: రైల్వే జోన్‌పై పీయూష్ గోయెల్ క్లారిటీ, బాబుకు కౌంటర్

అవిశ్వాసంపై చంద్రబాబు యూటర్న్ వెనుక

అవిశ్వాసంపై చంద్రబాబు యూటర్న్ వెనుక

వైసీపీ ప్రవేశపెట్టే అవిశ్వాసానికి మద్దతివ్వవద్దని తొలుత చంద్రబాబు, టీడీపీ భావించింది. హఠాత్తుగా ఆయన యూటర్న్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కారణమని చెబుతున్నారు. గుంటూరులో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ చేసిన వ్యాఖ్యల వెనుక బీజేపీ ఉందని టీడీపీ అనుమానిస్తోంది. అందుకే అవిశ్వాసానికి మద్దతివ్వాలని నిర్ణయించింది.

పవన్ దెబ్బకు మనసు మార్చుకున్న చంద్రబాబు

పవన్ దెబ్బకు మనసు మార్చుకున్న చంద్రబాబు

తొలుత అవిశ్వాసం అంశం చర్చకు రావడానికి పవన్ కళ్యాణ్ కారణం. టీడీపీ, వైసీపీలకు చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాసం పెట్టవచ్చు కదా అని నిలదీశారు. దానికి జగన్ సై అన్నారు. అయితే ఎన్డీయేలో ఉండటంతో పాటు అవిశ్వాసంతో లాభం లేదని చెబుతూ తాము మద్దతివ్వమని టీడీపీ నేతలు చెప్పారు. చంద్రబాబు కూడా అదే చెప్పారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శల దెబ్బకు బాబు మనసు మార్చుకున్నారు.

జగన్-పవన్ ఉచ్చులో చిక్కుకుపోయారా?

జగన్-పవన్ ఉచ్చులో చిక్కుకుపోయారా?

గుంటూరు సభలో టీడీపీపై తీవ్ర విమర్శలు, ఆ తర్వాత వైసీపీ ఎంపీ వరప్రసాద్ వ్యాఖ్యల నేపథ్యంలో కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయని అంటున్నారు. ఇటీవల తాను పవన్‌ను కలిశానని, ఫోన్ చేసి ఆహ్వానిస్తే వెళ్లానని, రాష్ట్ర రాజకీయాలపై చర్చించానని, 2019 తర్వాత వైసీపీకి మద్దతిస్తానని తనతో పవన్ చెప్పారని, హోదాతో జనసేనానితో కలిసి ఉద్యమిస్తామని షాకింగ్ కామెంట్స్ చేశారు.

పవన్ వెనుక బీజేపీ ఉండే అవకాశం లేదు

పవన్ వెనుక బీజేపీ ఉండే అవకాశం లేదు

ఇప్పుడు వరప్రసాద్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆసక్తికర ట్విస్టులు కనిపిస్తున్నాయి. ఓ వైపు పవన్ కళ్యాణ్ హోదాపై బీజేపీతో ఢీకొడుతున్నారు. మరోవైపు స్పష్టంగా లెఫ్ట్ పార్టీలతో కలుస్తానని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వెనుక కచ్చితంగా బీజేపీ ఉండే అవకాశం లేదని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి ఇదీ కారణం కావొచ్చు

పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి ఇదీ కారణం కావొచ్చు

2019 తర్వాత వైసీపీకి మద్దతు ఇస్తామనే విషయం మాట పక్కన పెడితే.. హోదా విషయంలో బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు, టీడీపీని రంగంలోకి దించేందుకు వైసీపీ, జనసేనలు పన్నిన వ్యూహంలో చంద్రబాబు చిక్కుకొని ఉండవచ్చునని అంటున్నారు. హోదా కోసం అవిశ్వాసం పెడతామని వైసీపీ అంటే టీడీపీ వెనక్కి పోయింది. వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టే అవిశ్వాసానికి మద్దతివ్వమని చెప్పింది. ఇది పవన్ ఆగ్రహానికి కారణమై ఉంటుందని అంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ ముందుకు రాకపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారని కొందరు భావిస్తున్నారు. ఇప్పుడు పవన్ విమర్శల నేపథ్యంలో అవిశ్వాసానికి టీడీపీ మద్దతిస్తుండటం గమనార్హం.

దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలకు, బీజేపీకి దెబ్బ

దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలకు, బీజేపీకి దెబ్బ

టీడీపీ అనూహ్య నిర్ణయానికి దేశవ్యాప్తంగా బీజేపీకి ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడం కూడా కారణాల్లో ఒకటిగా చెబుతున్నారు. స్వయంగా యూపీ సీఎం, డిప్యూటీ సీఎం నియోజకవర్గాల్లో గోరక్‌పూర్, పుల్పూర్‌లలో బీజేపీ ఓడిపోయింది. ఇటీవల జరిగిన పలు ఉప ఎన్నికల్లో బీజేపీకి దెబ్బ తగిలింది. మరోవైపు, మిత్రపక్షాలు దూరమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఇరకాటంలో పడుతుందని భావించి అవిశ్వాసానికి మద్దతివ్వడమే మంచిదని భావిస్తున్నా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+