వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోనసీమ గొడవలు ఉద్దేశపూర్వకం : కేంద్రం హెచ్చరించినా- మంత్రే బాధితుడు : పవన్ కళ్యాణ్..!!

|
Google Oneindia TeluguNews

కోనసీమ గొడవలపైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కోనసీమ లో జరిగిన గొడవలు ఉద్దేశ పూర్వకంగా జరిగినవేనని వ్యాఖ్యానించారు. కోనసీమకు ఇప్పటి వరకు సీఎం జగన్.. మంత్రులు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. కోనసీమ తగలబడుతుంటే మంత్రులు బస్సు యాత్ర చేస్తారా అని ప్రశ్నించారు. కోనసీమ సున్నితంగా ఉందని కేంద్ర నిఘా విభాగం ముందే హెచ్చరించిందని పవన్ కీలక వ్యాఖ్య చేసారు. అయినా, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు.

కోనసీమ ఘటనల వెనుక రాజకీయం

కోనసీమ ఘటనల వెనుక రాజకీయం

ప్రభుత్వం కుట్ర చేసిందనటానికి అనేక అంశాలు దోహదం చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటి వరకు కోనసీమ గురించి మాట్లాడకపోవటం.. డీజీపీ ఇప్పటికీ ఆ ప్రాంతానికి వెళ్లకపోవటం చూస్తుంటే కోనసీమలో రాజకీయం ఉందని తాము భావిస్తున్నామని పవన్ పేర్కొన్నారు.

ప్రభుత్వం అక్కడ చేసిన కుట్రకు మంత్రి విశ్వరూప్ బాధితుడయ్యారంటూ పవన్ వ్యాఖ్యానించారు. తనకు తెలిసినంత వరకూ విశ్వరూప్ మంచి వ్యక్తి అని.. రెచ్చగొట్టే స్వభావం ఉన్న వ్యక్తి కాదన్నారు. జనసేన కార్యకర్తలు కోనసీమ గొడవల్లో ఉన్నారంటూ ట్వీట్ చేసిన విజయ సాయిరెడ్డి.. విశ్వరూప్ కుమారుడి ఆడియో సైతం ట్వీట్ చేస్తే బాగుండేదని ఎద్దేవా చేసారు.

ఆ సమయంలోనే మంత్రుల బస్సు యాత్ర

ఆ సమయంలోనే మంత్రుల బస్సు యాత్ర


కోనసీమ గొడవలతో రాజకీయంగా ప్రయోజనమా..నష్టమా అనేది ఏ పార్టీ తీసుకోకూడదని..తాము అందుకు సిద్దంగా లేమని పవన్ కళ్యాన్ స్పష్టం చేసారు. ఇంత గొడవలు జరుగుతుంటే మంత్రులు బస్సు యాత్ర చేయటం అవసరమా అని ప్రశ్నించారు. వేల సంఖ్యలో నిరసన కారులు తరలి వస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదో.. దహనాలు చేస్తుంటే ఫైరింజన్ లు ఎందుకు రాలేదో అర్దం కావటం లేదని దుయ్యబట్టారు. రాజకీయంగా అంబేద్కర్ పేరు వాడుకుంటున్నారని.. ఇందులో చిత్తశుద్ది లేదని వ్యాఖ్యానించారు.

పోలవరం వైసీపీ హాయంలో పూర్తి కాదు

పోలవరం వైసీపీ హాయంలో పూర్తి కాదు


ఇక, వైసీపీ నేతలు కొట్టటం తమ హక్కుగా భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలవరం ఈ ప్రభుత్వ హయాంలో పూర్తి అవ్వదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఘటన జరిగిన రోజు నుంచి అక్కడే మకాం వేసిన సీనియర్ పోలీసు అధికారులు..పలువురిని అరెస్ట్ చేసారు. ఇప్పటికీ ఎనిమిది మండలాల్లో ఇంటర్నెట్ అందుబాటులోకి రాలేదు. వాట్సప్ సందేశాల ద్వారా గొడవలకు ముందస్తు ప్రణాళికలతో వ్యవహరించారని పోలీసులు గుర్తించారు. ఇక, కోనసీమ ఘటనపైన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపైన ఇప్పుడు వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

English summary
Janasena Chief Pawan Kalyan sesnsational comments against AP Govt over Konaseema Violence, he siad that central intellegence alert the state govt on sensitivity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X