టిలో మోడీ 4 సభలు: వెంటే పవన్, బాబు ఒక్కచోటే
హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఈ నెల 22వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయన ఒకేరోజు నాలుగు సభలలో పాల్గొంటారు ప్రతి సభలోను జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మాత్రం హైదరాబాదు సభలో మాత్రమే పాల్గొంటారు.
టూర్ వివరాలు
22వ తేదీనే నాలుగు సభలు నాలుగు జిల్లాల్లో ఉంటాయి. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం గం.1.15 నిమిషాలకు నిజామాబాదులో, మధ్యాహ్నం గం.3.15 నిమిషాలకు కరీంనగర్‌లో, సాయంత్రం గం.5.00కు మహబూబ్ నగర్‌లో, రాత్రి ఏడుగంటలకు హైదరాబాదులో మోడీ సభలు ఉంటాయి.

మోడీతో పాటే పవన్ కళ్యాణ్ ఈ పర్యటనలో ఉంటారు. ఆ రోజున మోడీ పాల్గొనే ప్రతి సభలోను పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు. అయితే చంద్రబాబు మాత్రం నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని సభలకు దూరంగా ఉంటారు. రాత్రి ఏడు గంటలకు హైదరాబాదులోని నిజాం కళాశాలలో జరగబోయే సభలో మోడీతో పాటు పవన్, చంద్రబాబులు పాల్గొంటారు.
పార్టీ పెద్దలు చూసుకుంటారు: కిషన్ రెడ్డి
సీమాంధ్రలో టిడిపితో పొత్తు వ్యవహారంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి స్పందించారు. టిడిపి, బిజెపి పొత్తు సీమాంధ్రలో ఉంటుందని భావిస్తున్నానని చెప్పారు. ఈ విషయమై పార్టీ పెద్దలు మాట్లాడుతారన్నారు.












Click it and Unblock the Notifications