వరుణ్ తేజ్ - లావణ్య వివాహం, సతీ సమేతంగా పవన్ -మెగా సెలబ్రేషన్స్..!!
మెగా సెలబ్రేషన్స్ సండదిగా మారాయి. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల వివాహం ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం మెగా హీరోలు ఇటలీ చేరుకుంటున్నారు. ఇప్పటికే వరుణ్ -లావణ్య లు ఇటలీకి వారం రోజులు ముందుగానే చేరుకున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ తన సతీమణి ఆనా తో కలిసి ఇటలీ వెళ్లారు. డిఫరెంట్ లుక్ లో విమానాశ్రయంలోని తన సతీమణి లెజ్నేవాతో తో కలిసి పవన్ ఎంట్రీ ఇస్తున్న ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల వివాహం నవంబర్ న ఇటలీలో జరగనుంది. వీరి వివాహం కోసం మెగా కుటుంబ సభ్యులు ఇటలీ చేరుకుంటున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ ఇటలీ వెళ్లారు. పవన్ దంపతులతో పాటుగా నిహారిక కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. పవన్ తన సతీమణి లెజ్నేవాతో తో కలిసి విమానాశ్రయం చేరుకున్నారు. పవన్ కాటన్ జీన్స్... మల్టీకలర్ గళ్ల షర్ట్ ధరించి కనిపిస్తున్నారు. చేతిలో నల్ల జాకెట్ కూడా ఉంది. చాలా కాలం తరువాత కొత్త గెటప్ లో పవన్ కనిపిస్తుండటంతో ఈ పొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ వివాహానికి పవన్ కళ్యాణ్ హాజరు అవుతారా లేదా అని అనుకున్నారు కానీ, అతను తన పనులను పక్కన పెట్టి, ఈ వివాహానికి హాజరు అవుతూ వున్నారు.

ఇప్పటికే వరుణ్ తేజ్, లావణ్య, ఇటలీ పయనం అయ్యారు. ఈ వివాహానికి మెగా కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది మిత్రులు హాజరు అవుతున్నారని తెలిసిందే. ఇటలీ లో వివాహం అయినా తరువాత, నవంబర్ 5వ తేదీన పరిశ్రమలోని అతిథిల కోసం ఒక రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారని తెలిసింది. కొంతమంది మెగా కుటుంబ సభ్యులు అప్పుడే ఇటలీ చేరుకున్నారని, మిగతా వాళ్ళు కూడా ఈరోజు రేపటితో చేరుకుంటారని తెలిసింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నారు. హైదరాబాదులోని నాగబాబు ఇంట్లో కొన్ని నెలల క్రితం నిశ్చితార్ధం జరిగింది. ఇప్పుడు ఇటలీలో వివాహం జరగనుంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్...వెడ్డింగ్ కార్డు వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications