చిన్న సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు..!
ఇటీవలికాలంలో బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమా జోరు కొనసాగుతోంది. భారీ బడ్జెట్ సినిమాల కంటే చిన్న సినిమాలకే ప్రస్తుతం ప్రేక్షకులు జై కొడుతున్నారు. కంటెంట్ సరిగ్గా ఉంటే చాలు హీరో ఎవరు..? డైరెక్టర్ ఎవరు..? అని పట్టించుకోకుండా సినిమాకు వెళ్తున్నారు. గతేడాది కోర్ట్, లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, శంభాల లాంటి చిన్న సినిమాలను ప్రజలు ఆదరించారు. అతి తక్కువ బడ్జెట్ తో క్వాలిటీ కంటెంట్ సినిమాలు తీసి, భారీ లాభాలు దక్కించుకోవడం ఎలాగో ఈ సినిమాలు నిరూపించాయి.
ఈ ఏడాది కఫుల్ ఫ్రెండ్లీ మొన్న వచ్చిన హాలీవుడ్ సెన్సేషన్ 'అబ్సెషన్' మూవీ సైతం తెలుగు రాష్ట్రాల్లో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మరో చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. అదే 'సింగ్ గీతం' మూవీ.. పేరుకు చిన్న సినిమా అయినా ఈ మూవీని టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు. అది కూడా 94 ఏళ్ల వయసులోనూ నేటి జెన్ జీ ను మెప్పించే విధంగా ఆయన తీసిన అద్భుత సృష్టి 'సింగ్ గీతం'.. ప్రస్తుతం థియేటర్లలో హౌజ్ ఫుల్ పడుతున్నాయి. స్క్రీన్ లు పెరిగాయి.
అయితే ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం.. ఈ చిత్రానికి మొదటి మూడు రోజుల్లో పాన్ ఇండియా వైడ్ గా దాదాపు రూ. 3 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయినట్లు సమాచారం. అలాగే అటు ఓవర్సీస్ కలెక్షన్స్ ను కూడా కలుపుకుంటే , ఈ చిత్రానికి మొదటి వీకెండ్ లోనే రూ. 4 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూల్లు దాంతోపాటు రూ. 2 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చినట్లు స్పష్టం అవుతోంది. ఐదో రోజున కూడా ఈ మూవీకి ఏ సెంటర్లు, మల్టీ ప్లెక్స్ ల్లో భారీగానే కలెక్షన్స్ వచ్చాయి. మొత్తం ఓవరాల్ గా నాలుగో రోజున సింగ్ గీతం చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు రూ. 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇక 'సింగ్ గీతం' మూవీలో ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించారు. 94 ఏళ్ల వయసులో లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం.












Click it and Unblock the Notifications