వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్ని ప్రాంతాలకు పార్లమెంటరీ కమిటీలను ప్రకటించిన పవన్ కళ్యాణ్

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన పార్టీ సంయుక్త పార్లమెంటరీ కమిటీలను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. ఈ కమిటీలు బీజేపీ స్థానిక కమిటీలతో సమన్వయం చేసుకొంటూ ఉభయ పార్టీలు నిర్ణయించిన కార్యక్రమాల నిర్వహణ, పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాలను జిల్లా, మండల, పట్టణ, గ్రామ స్థాయి వరకూ అమలయ్యేలా చూడటం, కమిటీ పరిధిలో ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీని క్షేత్ర స్థాయి వరకూ పటిష్టం చేయడం లక్ష్యాలుగా పని చేస్తాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

ఉత్తరాంధ్ర సంయుక్త కమిటీ

ఉత్తరాంధ్ర సంయుక్త కమిటీ

శ్రీకాకుళం, విజయనగరం, అరకు, విశాఖపట్టణం, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు ఉత్తరాంధ్ర సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా సుందరపు విజయ్ కుమార్ (యలమంచిలి), జాయింట్ కన్వీనర్‌గా గడసాల అప్పారావు (గాజువాక), సభ్యులుగా పరుచూరి భాస్కర రావు (అనకాపల్లి), పేడాడ రామ్మోహన్ (ఆమదాలవలస), డాక్టర్ బొడ్డేపల్లి రఘు (విశాఖపట్నం)గా ఉంటారు.

గోదావరి సంయుక్త కమిటీ

గోదావరి సంయుక్త కమిటీ

కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం, నరసాపురం, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాలకు గోదావరి సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వీనర్ గా శ్రీ మేడా గురుదత్ (రాజమహేంద్రవరం) శెట్టిబత్తుల రాజబాబు (అమలాపురం) జాయింట్ కన్వీనర్ గా, సభ్యులుగా వేగుళ్ల లీలాకృష్ణ (మండపేట), బొలిశెట్టి శ్రీనివాస్ (తాడేపల్లిగూడెం), యిర్రంకి సూర్యారావు (భీమవరం), గుణ్ణం నాగబాబు (పాలకొల్లు) సభ్యులుగా ఉంటారు.

సెంట్రల్ ఆంధ్ర సంయుక్త కమిటీ

విజయవాడ, మచిలీపట్టణం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ స్థానాలకు సెంట్రల్ ఆంధ్ర సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా కళ్యాణం శివ శ్రీనివాస్ (కె.కె., గుంటూరు), జాయింట్ కన్వీనర్‌గా సయ్యద్ జిలానీ (నరసరావుపేట), సభ్యులుగా పోతిన వెంకట మహేష్ (విజయవాడ), అమ్మిశెట్టి వాసు (విజయవాడ), గాదె వెంకటేశ్వర రావు (గుంటూరు), పాకనాటి రమాదేవి (గుంటూరు) సభ్యులుగా ఉంటారు.

రాయల దక్షిణ కోస్తా సంయుక్త కమిటీ

రాయల దక్షిణ కోస్తా సంయుక్త కమిటీ

తిరుపతి, చిత్తూరు, రాజంపేట, నెల్లూరు, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గాలకు రాయల దక్షిణ కోస్తా సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు, ఈ కమిటీకి కన్వీనర్‌గా డా. పసుపులేటి హరిప్రసాద్, షేక్ రియాజ్ జాయింట్ కన్వీనర్‌గా, సభ్యులుగా డా. పొన్ను యుగంధర్ (గంగాధర నెల్లూరు), సయ్యద్ ముకరం చాంద్ (రాజంపేట), యగవింటి (మైఫోర్స్) మహేష్ (మదనపల్లి), మాసి కృష్ణమూర్తి (తిరుపతి), ఆరేటి కవిత (చిత్తూరు), గానుగపెంట శ్రీకాంత్ (నెల్లూరు) ఉంటారు.

Recommended Video

Janasena Chief Pawan Kalyan Visits Amaravati Villages | Oneindia Telugu
రాయలసీమ సంయుక్త కమిటీ

రాయలసీమ సంయుక్త కమిటీ

అనంతపురం, హిందూపురం, కర్నూలు, నంద్యాల, కడప పార్లమెంట్ నియోజకవర్గాలకు రాయలసీమ సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వీనర్ గా టి.సి.వరుణ్ (అనంతపురం), సుంకర శ్రీనివాస్ (కడప) జాయింట్ కన్వీనర్ గా, సభ్యులుగా చింతా సురేష్ (కర్నూలు), రేఖ గౌడ్ (ఎమ్మిగనూరు), ఆకుల ఉమేష్ (హిందూపురం), మలిశెట్టి వెంకటరమణ (కడప) ఉంటారు.

English summary
pawan kalyan announces janasena parliamentary committees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X