వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్క ఛాన్స్ అంటే జగన్‌ను నమ్మేశారు.. చూడండి ఇప్పుడేం జరిగిందో : పవన్ కల్యాణ్

|
Google Oneindia TeluguNews

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వండని కోరగానే ఆయన్ను ముఖ్యమంత్రిని చేశారని, ఆయనకు ఓట్లు వేసినందుకు రాష్ట్రానికి ఎంత అన్యాయం చేస్తున్నారో చూడండని పవన్ కల్యాణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అప్పుడు ఎంత చెప్పినా ప్రజలు తన మాట పట్టించుకోలేదని.. ఇప్పుడు జగన్ నిర్ణయాలకు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. అప్పుడు తన మాట వినని రైతులు.. ఇప్పుడేమో తననే బాధ్యత తీసుకోవాలంటున్నారని వ్యాఖ్యానించారు. అమరావతి ప్రాంత రైతులు ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల కోసం భూములను త్యాగం చేశారన్న సంగతి అన్ని జిల్లాల ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల త్యాగాలను వృథా కానివ్వమన్నారు.

 అందరి ఆమోదంతోనే అమరావతిలో రాజధాని

అందరి ఆమోదంతోనే అమరావతిలో రాజధాని

రాజధానిని తరలించాలని చూస్తున్న సీఎం జగన్.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని ప్రతిపాదనను ఎందుకు వ్యతిరేకించలేదని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఆనాడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో అమరావతిలో రాజధాని ఏర్పాటుకు ఆయనకు అంగీకారం తెలిపారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం,రాష్ట్రంలోని అధికార,ప్రతిపక్షాలు ఒప్పుకున్న తర్వాతే అమరావతిలో రాజధాని

ఏర్పాటైందన్నారు. తీరా ఇప్పుడేమో రాజధానిని తరలించాలని జగన్ భావించడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు.

 అప్పుడే ఎందుకు అభ్యంతరం చెప్పలేదు..

అప్పుడే ఎందుకు అభ్యంతరం చెప్పలేదు..

అమరావతిలో రాజధాని ఏర్పాటుపై అభ్యంతరం ఉండి ఉంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు జగన్ ఎందుకు వ్యతిరేకించలేదని పవన్ ప్రశ్నించారు. పోనీ ఈ ఏడాది జరిగిన అసెంబ్లీఎన్నికల సమయంలో ఆ పార్టీ మేనిఫెస్టోలోనూ రాజధాని మార్పు అంశాన్ని ఎందుకు పెట్టలేదని నిలదీశారు. అమరావతికి 33వేల ఎకరాలు సేకరిస్తామంటే ఆరోజు ఎందుకు ఒప్పుకున్నారని మండిపడ్డారు.

రైతు కన్నీరు పెడితే రాష్ట్రానికి మంచిది కాదని అన్నారు.

 భరోసా కల్పిద్దామని వస్తే అడ్డుకుంటారా..

భరోసా కల్పిద్దామని వస్తే అడ్డుకుంటారా..

14 రోజులుగా ఆందోళన చేస్తుంటే రాజధాని ప్రాంత రైతులకు భరోసా ఇద్దామని తాను ఇక్కడికి వస్తే దారి పొడవునా తనను ముళ్ల కంచెలతో అడ్డుకున్నారని విమర్శించారు. గతంలో రాజధాని రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని చెప్పినప్పుడు ఎంత అండగా అయితే నిలబడ్డామో.. ఇప్పుడు కూడా అంతే అండగా నిలబడుతామని చెప్పారు.

వెనక్కి తగ్గవద్దు..

వెనక్కి తగ్గవద్దు..

పోలీసులు ఇబ్బందులు పెట్టినా.. కేసులు పెట్టినా రైతులు పోరాటం నుంచి వెనక్కి తగ్గవద్దన్నారు పవన్ కల్యాణ్. రాజధాని మార్చాలంటే ఏకాభిప్రాయం సాధించాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆరోజునే రాష్ట్ర రాజధాని విజయనగరమో,విశాఖపట్నంలోనో అని చెప్పి ఉంటే సంతోషంగా ఒప్పుకునేవాళ్లం అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతుల పట్ల నిర్దాక్షిణ్యంగా,నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెయిడ్ ఆర్టిస్టులంటూ రైతులను అవమానిస్తున్నారన్నారు. చాలామంది రైతులు ఇప్పటికే తమ ఇళ్లల్లో సూసైడ్ లెటర్స్ రాసి పెట్టుకున్నారని, ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారి పరిస్థితేంటని ప్రశ్నించారు.

ఇప్పటికైనా అమరావతి విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

రైతుల పట్ల నిర్దాక్షిణ్యంగా,

రైతుల పట్ల నిర్దాక్షిణ్యంగా,

వైసీపీ ప్రభుత్వం రైతుల పట్ల నిర్దాక్షిణ్యంగా,నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెయిడ్ ఆర్టిస్టులంటూ రైతులను అవమానిస్తున్నారన్నారు. చాలామంది రైతులు ఇప్పటికే తమ ఇళ్లల్లో సూసైడ్ లెటర్స్ రాసి పెట్టుకున్నారని, ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారి పరిస్థితేంటని ప్రశ్నించారు.

English summary
Janasena Chief Pawan Kalyan severly criticised CM YS Jagan over capital shifting from Amaravathi. Pawan questioned Jagan why he does't objected Amaravathi as capital when he was in opposition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X