నాపై రుబాబు చేశారు: వైయస్‌పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్య
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొందరు ధనవంతులు బలవంతులయ్యా రని జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తనను కూడా బలవంతంగా సినిమా తీయాలని రుబాబు చేశారని ఆయన గుర్తు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పారు.
భారతీయ జనతా పార్టీకి తాను మద్దతు ఇస్తున్నానని, ఈ కారణంగా బిజెపి లబ్ది పొందితే అది తెలుగుదేశం పార్టీ కి కూడా ఉపయోగపడ వచ్చని పవన్ కళ్యా ణ్ అభిప్రాయపడ్డారు. తాను రాసిన పుస్తకాన్ని కొందరు తప్పు బట్టడంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. రామాయణాన్ని కూడా బూతులు తిట్టేవారుంటారు అని వారి గురించి ఏమనాలని అన్నారు.

జనసేన పార్టీని ప్రక టించిన తర్వాత పవన్ ఒక టివీ ఛానల్‌కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. అవసరమైతే అన్నయ్యను ప్రశ్నిస్తానని అన్నారు. పవన్ కళ్యాణ్ ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా చర్చనీయాంశమైంది.
తెలుగుదేశం, బిజెపిలకు ఉపయోగపడే విధంగా పవన్ కళ్యాణ్ కార్యాచరణను రూపొందించుకున్నారనే మాట వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ రాసిన ఇజం పుస్తకాన్ని ప్రముఖ దర్శకనిర్మాత రామ్ గోపాల్ వర్మ కూడా తప్పు పట్టారు. అది తనకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications