Pawan Kalyan: పవన్ కు మళ్లీ అస్వస్ధత-తెనాలి టూర్ వాయిదా..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్ధతకు గురయ్యారు. పిఠాపురంలో నాలుగు రోజులుగా పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ఇవాళ అక్కడ ముగించుకుని గుంటూరు జిల్లా తెనాలి వెళ్లాల్సి ఉంది. ఈ మేరకు తెనాలిలో పవన్ వారాహి యాత్రకు ఘనంగా ఏర్పాట్లు కూడా చేశారు. కానీ చివరి నిమిషంలో అనారోగ్యం కారణంగా తెనాలి టూర్ ను వాయిదా వేసుకుని ఆయన హైదరాబాద్ బయలుదేరి వెళ్లిపోయారు.
పిఠాపురంలో తన ప్రచారం ప్రారంభించిన తర్వాత పవన్ కళ్యాణ్ జ్వరం బారిన పడ్డారు. దీంతో మధ్యలో ప్రత్యేక హెలికాఫ్టర్ లో హైదరాబాద్ వెళ్లి వచ్చారు. ఇప్పుడు పిఠాపురం నుంచి తెనాలి వెళ్లాల్సి ఉండగా.. మరోసారి అస్వస్ధతకు గురయ్యారు. పవన్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని తెలిపింది.

పవన్ కళ్యాణ్ ఈ రోజు తెనాలిలో చేపట్టాల్సిన వారాహి విజయ భేరి కార్యక్రమంతోపాటు ఉత్తరాంధ్ర పర్యటన వాయిదా వేసుకున్నట్లు జనసేన పార్టీ ప్రకటనలో తెలిపింది. కనీసం రెండు మూడు రోజుల విశ్రాంతి అవసరం అని వైద్యులు చెప్పినట్లు వెల్లడించింది. త్వరలో రీ షెడ్యూల్ చేసి పర్యటన పునః ప్రారంభిస్తారని పేర్కొంది. రీ షెడ్యూల్ చేసిన కార్యక్రమాన్ని త్వరలో ప్రకటిస్తారని జనసేన ప్రకటనలో తెలిపింది.












Click it and Unblock the Notifications