చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ-అజెండాలో ఇవే..!
ఏపీలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (pawan kalyan).. ఇవాళ సీఎం చంద్రబాబు (chandrababu)తో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ఆయనతో సమావేశమయ్యారు. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంపై ప్రెస్ మీట్ తర్వాత వీరిద్దరూ భేటీ కావడం ఇదే తొలిసారి. దీంతో చంద్రబాబు, పవన్ భేటీపై ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో వీరిద్దరూ పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా టీడీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వీడియోల వ్యవహారం, కల్తీ నెయ్యిపై ఏక సభ్య కమిషన్ ఏర్పాటు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, మండలిలో వైఎస్సార్సీపీ వ్యవహారశైలి వంటి పలు అంశాలపై వీరిద్దరూ చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో తాజాగా మారుతున్న రాజకీయ పరిస్ధితులపైనా వీరిద్దరి మధ్య చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

మరోవైపు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవుల పంపకాలపైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధానమైన నామినేటెడ్ పదవుల పంపకాలు పూర్తయ్యాయి. దీంతో రాజ్యసభ ఎన్నికలు, కేబినెట్ లో మార్పులు, నాగబాబు విషయంలో ఏం చేయాలన్న దానిపై చర్చ వస్తున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం, కేంద్రంతో సమన్వయం చేసుకోవాల్సిన అంశాలపైనా చంద్రబాబు, పవన్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత ఇరువురూ స్పందిస్తే తప్ప ఈ విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.












Click it and Unblock the Notifications