చంద్రబాబు - పీకే భేటికి పవన్ దూరం : ఢిల్లీ "కమాండ్", లెక్క మారుతోంది..!!
ఏపీలో రాజకీయాల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీతో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం పని చేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చంద్రబాబు కోసం ఏ మేర సహకిరిస్తారనేది ఆసక్తిని పెంచుతోంది. అయితే, ఎన్నికల వ్యూహాల పై ప్రశాంత్ కిషోర్ తో చర్చల వేళ పొత్తు ఖరారు చేసుకున్న పవన్ ను ఎందుకు ఆహ్వానించలేదనే దాని పైన కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పీకే - చంద్రబాబు భేటీ : ఏపీలో జగన్ ఓటమే లక్ష్యంగా చంద్రబాబు - పవన్ కలిసారు. సీట్ల షేరింగ్ తో పాటుగా ఉమ్మడి మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తున్నారు. ఈ సమయంలోనే లోకేష్ సీఎంగా పవన్ కు అవకాశం ఇవ్వటం పైన ఆలోచనే లేదని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలతో జనసేన ఆత్మరక్షణలో పడింది. దీని పైన చర్చ సాగుతున్న సమయంలోనే చంద్రబాబు వ్యూహాత్మకంగా ప్రశాంత్ కిషోర్ ను ఉండవల్లిలోని తన నివాసానికి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల పైన చర్చించారు. ఈ చర్చలకు సమీపంలోనే పవన్ కల్యాణ్ హాజరు కాలేదు. ఎన్నికల పై జరిగిన ఈ కీలక భేటీకి పవన్ ను చంద్రబాబు ఆహ్వానించారా.. లేక పిలిచినా పవన్ రాలేదా అనేది ఇప్పుడు రెండు పార్టీల్లో చర్చ జరుగుతోంది. అయితే, పీకే - చంద్రబాబు భేటీతో కొత్త సీమకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ఢిల్లీ నేతలు ఈ అంశం పైన ఫోకస్ చేసారు.

లోకేష్ వ్యాఖ్యలతో : లోకేష్ సీఎంగా పవన్ కు ఇవ్వటం పైన ఆలోచనే లేదని చెప్పటం పైన జనసేనాని అసహనంతో ఉన్నట్లు సమాచారం. తాను తన సొంత పార్టీని ఒప్పించి పొత్తుకు ముందుకు వస్తున్న సమయంలో తనను ఆత్మరక్షణలోకి నెట్టే విధంగా ఈ వ్యాఖ్యలు చేయటం పైన ఆయన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే ప్రశాంత్ కిషోర్ మూడు నెలలుగా టీడీపీతో టచ్ లో ఉన్నారు. తాజా బేటీ సమయంలో పవన్ కు సమాచారం ఇచ్చినా ఆయన హాజరు కాలేదని టీడీపీ నేతలు చెబుతున్న మాట. టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ ముందుకు రావాలని పవన్ కోరుకుంటున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమికి దగ్గరగా జాతీయ స్థాయిలో వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ప్రస్తావనకు వస్తోంది.

పవన్ కొత్త వ్యూహం : గతంలో 2019 ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ వైసీపీ గెలుపు కోసం పని చేసిన సమయంలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేసారు. బీహార్ డెకాయిట్ అంటూ చంద్రబాబు నాడు వ్యాఖ్యానించారు. ఇప్పడు తిరిగి అదే ప్రశాంత్ కిషోర్ తో చంద్రబాబు భేటీ అవ్వటం పవన్ ను నచ్చటం లేదని జనసేన వర్గాల సమాచారం. బీజేపీ కలిసి రాకపోతే పూర్తిగా టీడీపీతోనే వెళ్లాలనేది పవన్ అభిప్రాయంగా ప్రచారం సాగుతున్నా..తాజా పరిణామాలతో పవన్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. తాను కోరుకున్న విధంగా సీట్లు.. మేనిఫెస్టో..అధికారంలో ప్రాధాన్యత పైన స్పష్టత వచ్చిన తరువాతనే బీజేపీ వ్యవహారంలో పవన్ నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగా పవన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications