మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్, తెలంగాణ మాత్రం మిగిలింది, బాబుతో చర్చలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆయర ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని పేరు ఉంది. ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా ఆయన నెరవేరుస్తారని పవన్ కల్యాణ్ కు పేరు ఉంది. ఆంధ్రప్రదేశ్ వరద బాధితులను ఆదుకోవడానికి తాను వ్యక్తిగతంగా కోటి రూపాయలు విరాళం ఇస్తానని ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు.
తెలంగాణ వరద బాధితులకు కూడా కోటి రూపాయలు విరాళం అందిస్తానని పవన్ కల్యాణ్ మాట ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో కలిసిన జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సీఎం సహాయ నిధికి కోటి రూపాయలు విరాళం అందించారు. విజయవాడ కలెక్టర్ ఆఫీసు కార్యాలయంలో వినాయక చవితి సందర్బంగా ఏర్పాటు చేసిన గణపతికి పూజలు చేసిన అనంతరం పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు.

ఇదే సమయంలో విజయవాడ తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చర్చించారని సమాచారం. కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్యం గురించి సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని మీరు త్వరగా కోలుకొని ప్రజాసేవ చెయ్యాలని సీఎం చంద్రబాబు డీసీఎం పవన్ కల్యాణ్ కు సూచించారని సమాచారం.
ఇదే సందర్బంలో విజయవాడతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు గ్రామాల ప్రజలు త్వరగా ఆదుకునే విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు, డీసీఎం పవన్ కల్యాణ్ చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వరద బీభత్సంతో అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వినాయక చవితి రోజున సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి సీఎం సహాయనిధికి కోటి రూపాయల విరాళం అందజేశారు.

వరద బాధితులను ఆదుకుంటానని ముందుగానే ప్రకటించిన పవన్ కల్యాణ్ ఈరోజు ఆయన మాట నిలబెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని జనసేన నాయకులు, పవర్ స్టార్ అభిమానులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న గ్రామాలకు నాలుగు కోట్ల రూపాయల తన వ్యక్తిగత సొమ్ము అందిస్తానని ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. 400 గ్రామాల అభివృద్ధి కోసం నాలుగు కోట్ల రూపాయలు ఆయా గ్రామాల బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications