పవన్ కల్యాణ్ ఎఫెక్ట్: బిజెపికి జగన్ సంకేతాలు, పొత్తులకు రెడీ

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చి వచ్చే కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలతో మినహా ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు కన్నబాబు ప్రకటించారు.

వచ్చే కార్పోరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయడానికి జగన్ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో కన్నబాబు మంగళవారం మీడియాతో మాట్లాడారు. జగన్ వ్యూహంలో భాగంగానే కన్నబాబు ఆ విషయం చెప్పినట్లు తెలుస్తోంది. బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆ రకంగా వైయస్ జగన్ సంకేతాలు పంపినట్లు కూడా భావిస్తున్నారు.

బిజెపి తనతో రాని పక్షంలో జగన్ వామపక్షాలతో పొత్తు పెట్టుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. పవన్ కల్యాణ్‌ ఎన్నికల్లో నిలబడితే తమకు సంభవించే ప్రమాదాన్ని పసిగట్టి జగన్ తొందరపడుతున్నట్లు చెబుతున్నారు. వామపక్షాలు తెలుగుదేశం పార్టీపై తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నాయి. అయితే ఆ పార్టీలు పవన్ కల్యాణ్‌తో కలుస్తాయా, పవన్ కల్యాణ్ ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటారా అనేది ఇంకా తేలడం లేదు.

Pawan kalyan effect: YS Jagan eager to forge alliance with left

ఆయన వామపక్షాల పట్ల సానుకూల వైఖరితో ఉన్నట్లు మాత్రం తిరుపతి బహిరంగ సభలో చేసిన ప్రసంగాన్ని బట్టి అర్థమవుతోంది. పైగా, ఆయన బిజెపిపై పోరాటానికి సిద్ధపడినట్లు కూడా పవన్ కల్యాణ్ సంకేతాలు ఇచ్చారు. దానివల్ల పవన్ కల్యాణ్ తమకు వ్యతిరేకంగా ముందుకు వస్తే బిజెపి కొత్త మిత్రుడి కోసం అన్వేషణ ప్రారంభించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అయితే, పవన్ కల్యాణ్‌ను బిజెపియే రంగంలోకి దించిందని, చంద్రబాబుతో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధపడిన బిజెపి పవన్ కల్యాణ్ డిమాండ్ చేస్తేనే ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ ఇచ్చిందని నమ్మించడానికి ప్రయత్నిస్తోందని అంటున్నారు.

అందులో ఎంత వరకు నిజం ఉందనేది చెప్పలేం గానీ జగన్ మాత్రం పవన్ కల్యాణ్ రాకను గమనించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మాత్రం అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధింంచకపోతే జగన్‌కు ఆ తర్వాత కష్టాలు తప్పకపోవచ్చునని, పార్టీని నిలబెట్టడం కూడా కష్టమవుతుందని అంటున్నారు. అందువల్ల పవన్ కల్యాణ్ రంగంలోకి దిగినా సరే, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే ఉద్దేశంతోనే జగన్ పొత్తుల గురించి ఇప్పటి నుంచే మాట్లాడుతున్నారని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+