పవన్ కళ్యాణ్ మతమార్పిడులకు ప్రోత్సహిస్తున్నారు; ఒళ్ళు దగ్గర పెట్టుకోండి: బీజేపీనేత మాధవీలత సంచలనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతమార్పిడుల పై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏపీలో మతమార్పిడులపై బిజెపి రాష్ట్ర సహాయ ఇన్చార్జ్ సునీల్ దియోధర్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఏపీలో వైయస్ జగన్ ప్రభుత్వం మతమార్పిడులు ప్రోత్సహిస్తుందని బీజేపీ అధికారంలోకి వస్తే ఏపీలో మత మార్పిడి నిరోధక చట్టం తీసుకొస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ లో చర్చనీయాంశం కాగా తాజాగా బీజేపీ నేత, సినీ నటి మాధవి లత జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారన్న బీజేపీ నేత మాధవీ లత

పవన్ కళ్యాణ్ మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారన్న బీజేపీ నేత మాధవీ లత


సోషల్ మీడియా వేదికగా ఆమె పవన్ కళ్యాణ్ మతమార్పిడులకు ప్రోత్సహిస్తున్నారు అంటూ పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు క్రిస్మస్ విషెస్ చెప్పండి ..నమ్మినవారికి విషెస్ అని చెప్పండి ఇంకా సంతోషం. మానవాళికి లాంటి పెద్ద మాటలు ఎందుకండీ? మీరే మతమార్పిడులకు ఎంకరేజ్మెంట్ చేసేలా ఉంది మీ పోస్ట్. విషెస్ చెప్పండి చాలు అంటూ పేర్కొన్న ఆమె బైబిల్ ని మనమే బోధించనక్కరలేదంటూ పవన్ కళ్యాణ్ పోస్ట్ కు సెటైర్ వేశారు.

 కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది అంటూ వార్నింగ్

కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది అంటూ వార్నింగ్

అక్కడ ఎవరు దేవుడు లేరని రెస్పెక్ట్ ఇద్దాం అంతవరకే అంటూ మీరు చెప్పిన విషయం తప్ప మీరు రాసిన కంటెంట్ తనకు నచ్చలేదంటూ వ్యాఖ్యలు చేశారు. సర్వ ప్రాణుల పట్ల ప్రేమ ఉండాలని ఏసుక్రీస్తు చెప్పలేదని యూదుల వరకే ఆయన ప్రేమ అని చెప్పారని పేర్కొన్నారు. మనం యూదులం కాదు అంటూ వ్యాఖ్యానించిన మాధవిలత మీ పేజీని నిర్వహిస్తున్న వాళ్ళు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిదంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు మొన్న మీరు బైబిల్ గురించి చాలా గొప్పగా చెప్పారు. అంత గొప్ప ఏం లేదండి.. కానీ ఫ్లోలో మీరు కూడా మతమార్పిడులకు కారణం కావద్దు అంటూ బిజెపి నేత నటి మాధవి లత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు.

మీ పోస్ట్ బాధకు గురి చేసింది అన్న మాధవీ లత

మీ పోస్ట్ బాధకు గురి చేసింది అన్న మాధవీ లత

పవన్ కళ్యాణ్ చేసిన పోస్టు తనను చాలా బాధకు గురి చేసిందని, మీ పోస్టులో విషెస్ కంటే మతమార్పిడులకు సపోర్ట్ చేస్తున్నట్లు ఉందని మాధవీలత పేర్కొన్నారు. ఒక హిందువుగా మీ పోస్టు పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాం అంటూ మాధవిలత పోస్ట్ చేసి, అందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఏ మతానికి సంబంధించిన వారి పండుగ అయినప్పటికీ పవన్ కళ్యాణ్, ఆ మత విశ్వాసాలను గౌరవిస్తూ, వారి పండుగలు ఉద్దేశాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తుంటారు.

క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిన పవన్ కళ్యాణ్

క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిన పవన్ కళ్యాణ్

ఇక అదే క్రమంలో తాజాగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన పవన్ కళ్యాణ్ దైవం మానుష రూపేణా అంటారు. మానవుడిగా జన్మించి మానవులను ప్రేమించి మానవులను జాగృత పరచడానికి దివి నుండి భువికి ఏతెంచిన దైవ పుత్రుడు ఏసుక్రీస్తు అంటూ, ఏసుక్రీస్తు గొప్పతనాన్ని, క్రిస్మస్ వేడుక యొక్క ప్రాధాన్యతను తన పోస్ట్ లో వెల్లడించారు. ఏసుక్రీస్తు అవతార పురుషుడని ఆయన జన్మదినం మానవాళికి గొప్ప పర్వదినం అంటూ వెల్లడించారు. ఏసు నామాన్ని స్మరిస్తూ ఏసు ప్రభువు పట్ల అచంచల విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరికి నా తరఫున, జనసేన శ్రేణుల తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.

పవన్ తన విషెస్ లో చెప్పింది ఇదే .. డానికి మాధవీ లత షాకింగ్ రియాక్షన్

పవన్ తన విషెస్ లో చెప్పింది ఇదే .. డానికి మాధవీ లత షాకింగ్ రియాక్షన్

సర్వ ప్రాణుల పట్ల కరుణ, ప్రేమ, సేవా భావం ఎల్లవేళలా ఆచరణీయం అంటూ వెల్లడించారు. క్షమా, దయ కలిగి ఉండడమే క్రీస్తుపై భక్తికి తార్కాణమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆశ్రిత జనులకు సుఖసంతోషాలను ప్రసాదించమని ఆ కరుణామయుడుని ప్రార్థిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లోనూ పోస్ట్ పెట్టారు. ఈ పోస్టు పై స్పందించిన మాధవిలత పవన్ కళ్యాణ్ చేసిన పోస్ట్ మతమార్పిడులు ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పర మతాలను గౌరవించడం తప్పులేదని, కానీ దానిని గొప్పగా చిత్రీకరించి, మత మార్పిడులకు కారణమయ్యేలా పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్నారు అంటూ చేసిన పోస్ట్ ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. ఒక పక్క పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, బిజెపికి మిత్రపక్ష పార్టీగా ఉండగా, మరోపక్క బిజెపి నేత, సినీ నటి మాధవి లత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+