వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కల్యాణ్‌కు ఆదిలోనే రాజధాని ప్రాంతంలో చుక్కెదురు

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో చుక్కెదురైంది. రాజధాని నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంభించాలని అనుకున్న ఆయనకు అడ్డంకులు ఏర్పడ్డాయి.

మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలో సర్వే నెంబర్ 181/182 పరిధిలోని మూడు ఎకరాల భూమిలో ఆయన పెద్ద యెత్తున సభ నిర్వహించారు. అక్కడే ఆయన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునేందుకు స్థల యజమానితో ఒప్పందం కుదుర్చుకున్నారు.

 వివాదంపై స్థానిక కోర్టులో ఇలా...

వివాదంపై స్థానిక కోర్టులో ఇలా...

అది ముస్లిం వర్గాలకు చెందిన స్థలం కావడంతో దానిపై ప్రస్తుతం హైకోర్టులో వివాదం నడుస్తోంది. ముస్లిం నేత జక్రియాకు, దివంగత యార్లగడ్డ సుబ్బారావుతో జరిగిన వివాదంంలో స్థానిక న్యాయస్థానంలో జక్రియాకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

 ప్రస్తుతం హైకోర్టులో వివాదం...

ప్రస్తుతం హైకోర్టులో వివాదం...

స్థానిక కోర్టులు ఇచ్చిన తీర్పుపై ప్రత్యర్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు ప్రస్తుతం హైకోర్టులో నడుస్తోంది. అయితే, దివంగత సుబ్బారావు కుమారుడు వెంకటేశ్వర రావుతో ఆ మొత్తం స్థలంలో జనసేన కార్యాలయం ఏర్పాటు కోసం పవన్ కల్యాణ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఒప్పందం చేసుకున్నారు.

 దానిపై ముస్లిం ఐక్య వేదిక

దానిపై ముస్లిం ఐక్య వేదిక

దానిపై ముస్లిం ముస్లిం ఐక్య వేదిక రాష్ట్రాధ్యక్షుడు షేక్ జలీల్ ఇటు రాజకీయ పోరాటంతో న్యాయపోరాటం సాగించారు. ఆ క్రమంలో ఆయనపై మంగళగిరి పోలీసు స్టేషన్‌లో రౌడీ షీట్ తెరిచారు అది ముస్లిం వర్గాల ఆగ్రహానికి కారణమైంది.

Recommended Video

Telugu Actors Demands Special Status For Andhra Pradesh
 జనసేన తరఫున ఇలా...

జనసేన తరఫున ఇలా...

వివాదం రగులుతున్న క్రమంలో జనసేన తరపున కొంత మంది న్యాయవాదులు, స్థానిక నేతలు ఆది, సోమవారాల్లో వివాదాస్పద స్థలంలో అన్ని రకాల రికార్డులను పరిశీలించారరు. స్థలం కోర్టు వివాదలో ందని గుర్తించారు. దాతో అప్పటికప్పుడు ఆ స్థలంలో తాత్కాలిక వేసిన రేకుల షెడ్లను తొలగించారు. రేకులను, ఇనుపరాడ్లను అక్కడి నుంచి తరలింారు. తెలిసో తెలియకో జరిగిన తప్పిదాన్ని పవన్ కల్యాణ్ అంగీకరించి ముస్లింలకు క్షమాపణ చెప్పాలని జలీల్ అంటున్నారు.

English summary
Jana Sena chief Pawan Kalyan has faced poblem at Mangalagiri due to land controversy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X