ఆ క్లారిటీ లేదా: పవన్‌పై మహేష్ కత్తి, ఫ్యాన్స్ వార్నింగ్, రోజాకు సైతం...
హైదరాబాద్: సినీ విమర్శకుడు మహేష్ కత్తి జనసేన చీఫ్, సినీ హీరో పవన్ కల్యాణ్‌పై తాజాగా విమర్శలు చేశారు. ఆయన వరుస విమర్శలపై పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.
Recommended Video

తనకు హెచ్చరికలు చేస్తూ పవన్ కల్యాణ్ అభిమానులు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా మహేష్ కత్తి తన పేస్‌బుక్‌లో పోస్టు చేశారు. Examples of ఉన్మాదం... అంటూ రాసి ఆ వీడియోను పోస్టు చేశారు.

అజ్ఞాతవాసి ఆడియో విడుదల తర్వాత ఇలా...
"పాలిటిక్స్ గురించి క్లారిటీ రాలేదు సరే.. ఇప్పుడు సినిమాల మీద ఉన్న క్లారిటీ పోయినట్లు ఉందే.. ఆడియో పంక్షన్ అయిపోయింది. సినిమా బాగా అమ్ముడుపోయింది. రిలీజ్‌కి ఇంకా నెలుంది. ఇకనైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడదామా..! కనీసం నెలైనా!!!" అని మహేశ్ కత్తి తన ఫెస్‌బుక్‌లో పోస్టు చేశాడు.

ఆడియో విడుదలైన తర్వాత..
పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాదు నగరంలోని స్టార్ హోటల్ నవోటెల్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆడియో విడుదల తర్వాత కత్తి మహేశ్ పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ పోస్టు పెట్టాడు.

మహేష్ కత్తిపైనే కాదు, రోజాపై సైతం..
అజ్ఞాతవాసి ఆడియో విడుదల కార్యక్రమానికి వచ్చిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మహేష్ కత్తిపైనే కాకుండా రోజాపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హెచ్చరికలు చేశారు, బతిమాలాడుతున్నట్లు మాట్లాడారు. ఉన్మాదానికి నిదర్శనమంటూ ఆ వీడియోను మహేష్ కత్తి తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశారు.

ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని...
మహేష్ కత్తి ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఫ్యాన్స్ హెచ్చరించారు. పవర్ స్టార్ వల్ల ఆగుతున్నామని, లేదంటే మహేష్ కత్తికీ రోజాకూ తప్పదని వారన్నారు. పవన్ కల్యాణ్ తీసేసిన గోరు దొరికితే కూడా తాము కళ్లకు అద్దుకుంటామని, అటువంటిది ఆయనపై వ్యాఖ్లు చేస్తే ఎలా సహిస్తామనే పద్ధతిలో వారు మాట్లాడారు.

అప్పుడు నీ కళ్లు ఏమయ్యాయని...
సిద్ధాంతమని కాదు, అప్పుడు మహేష్ కత్తికి కనిపించలేదా అని పవన్ కల్యాణ్ అభిమానులు అడిగారు. బొడ్డు కింద చీరలు కట్టి చూపిస్తున్నారు, సగం దుస్తులు వేసుకుని కనిపిస్తున్నారు, అప్పుడు నీ కళ్లు ఏమయ్యాయని వారు మహేష్ కత్తిపై విరుచుకుపడ్డారు. నీకు ఎవరు డబ్బులు ఇస్తున్నారు, చందాలు వేసుకుని మేం ఇస్తాం, మా పవన్ కల్యాణ్‌ను వదిలిపెట్టు, ప్లీజ్ అని అన్నారు.
-
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications