పవన్ కల్యాణ్, శివాజీ జోడీ: వామపక్షాల రాజకీయ వ్యూహం

విజయవాడ: తన వెనక ఎవరూ లేరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గొంతు చించుకుని చెప్పినప్పటికీ అనుమానాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై మెతక వైఖరి అవలంబిస్తూ బిజెపిపై, ఆ పార్టీ నేత వెంకయ్య నాయుడిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం ఓ వైపు ఉండగానే దానికి మించిన రాజకీయ వ్యూహం ఏదో ఉందనే చర్చ సాగుతోంది.

పవన్ కల్యాణ్ కాకినాడ సీమాంధ్ర ఆత్మగౌరవ సభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మద్దతు తెలిపారు. అదే సమయంలో రాష్ట్ర విభజన విషయంలో సిపిఎం వైఖరిని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సిపిఎం వైఖరిని కొనియాడుతూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి పేరును ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

గతంలో కూడా వామపక్షాలంటే తనకు గౌరవం ఉందని పవన్ కల్యాణ్ చెప్పారు. దాన్ని బట్టి వచ్చే ఎన్నికల నాటికి వామపక్షాలతో కలిసి పవన్ కల్యాణ్ రాజకీయం జోరును పెంచుతారనే అనే చర్చ సాగుతోంది. మరోవైపు, తెలుగు సినీ నటుడు శివాజీ ప్రత్యేక హోదాపై తెలుగుదేశం, బిజెపిలను దుయ్యబడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటానికి ముందుకు వస్తే తాను పవన్ కల్యాణ్ వెంట నడుస్తానని చెప్పారు.

Pawan Kalyan fight: Chandrababu strategy to corner BJP

శివాజీ వెనక కూడా వామపక్షాలు ఉన్నట్లు చెబుతున్నారు. పైగా, ఇటీవల శివాజీ పవన్ కల్యాణ్‌ను రహస్యంగా కలిసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇదంతా చూస్తుంటే, చాప కింద నీరులా పవన్ కల్యాణ్ రాజకీయం కొనసాగుతోందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఓ వైపు తన ప్రసంగాల ద్వారా ప్రజలను తన వైపు తిప్పుకునే పని కొనసాగుస్తూనే వ్యవస్థీకృతంగా పనిచేయడానికి వామపక్షాల నేతలు పవన్ కల్యాణ్‌కు సహకరించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

పవన్ కల్యాణ్ రాజకీయాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడిప్పుడే కచ్చితమైన అభిప్రాయానికి రావడం కష్టమే అయినప్పటికీ రాజకీయ సమీకరణాలు మాత్రం మారడానికి రంగం సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+