• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీన్ రివర్స్ - పవన్ హైజాక్ : చంద్రబాబు పొరపాటు - టీడీపీలో కొత్త టెన్షన్..!!

|
Google Oneindia TeluguNews

ఏపీలో రాజకీయం రూటు మారుతోంది. రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఏపీలో ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చుట్టూ రాజకీయం తిరుగుతోంది. విశాఖ గర్జన తరువాత పవన్ కల్యాణ్ పర్యటన సమయం నుంచి తాజాగా అదే విశాఖ కేంద్రంగా ప్రధానితో భేటీ వరకు రాజకీయం మొత్తం వపన్ చుట్టూనే నడుస్తోంది. ప్రధాని ప్రతిపక్షం టీడీపీ కంటే ఇప్పుడు పవన్ వర్సస్ వైసీపీ అన్నట్లుగా రాజకీయ పోరు మారుతోంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు టీడీపీలో కొత్త చర్చకు..టెన్షన్ కు కారణమవుతున్నాయి.

టీడీపీకి అంతు చిక్కని పవన్ దూకుడు
జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఒక ప్రధాన వర్గం ఓట్లు కలిసి వస్తాయి.. పవన్ ఇమేజ్ తమకు అధికార దగ్గర చేస్తుందని టీడీపీ నేతలు అంచనా వేసారు. పొత్తులో భాగంగా కొన్ని సీట్ల వరకు మాత్రమే ఆలోచన చేసారు. కానీ, ఇప్పుడు లెక్కలు మారుతున్నాయి. పవన్ టీడీపీని డామినేట్ చేస్తున్నారు. టీడీపీ కంటే కొన్ని సందర్భాల్లో బలమైన ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్నారు. జనం నుంచి స్పందన కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ తాను అధికారంలోకి రావటం గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. ప్రధానితో భేటీ తరువాత..బీజేపీతో పవన్ బంధం మరింత బలోపేతం అవుతుందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. కానీ, పవన్ ఎక్కడా బీజేపీ ప్రస్తావన తీసుకురావటం లేదు. టీడీపీతో పొత్తు వ్యవహారంలోనే ఇప్పటికిప్పుడు అధికారికంగా స్పష్టత ఇచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది.

Pawan Kalyan Graph in AP hijacks TDP Charishma,Was it that what YSRCP wants

టీడీపీని హైజాక్ చేస్తున్న జనసేనాని
టీడీపీతో పొత్తు కుదిరినా.. తాను డిమాండ్ చేసిన సీట్లు ఇచ్చే స్థాయిలో నిలబడేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా తన బలం ఏంటో నిరూపించుకొనే వ్యూహాలు అమలు చేస్తున్నారు. అటు ఒక రకంగా వైసీపీ కోరుకుంటుందీ ఇదే. పవన్ ఎంతగా బలపడితే తమకు అంత మంచిదని వైసీపీ నేతలు అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్నారు. అటు టీడీపీ- ఇటు జనసేన పొత్తు ఉన్నా.. సీట్ల విషయం అంత సులభంగా తేలేది కాదని అంచనా వేస్తున్నారు. ప్రధానితో పవన్ భేటీ తరువాత టీడీపీ - జనసేన పొత్తు వ్యవహారం పైన రాజకీయ వర్గాల్లోనే కొన్ని సందేహాలు మొదలయ్యాయి. ఇదే తరహాలో పవన్ దూసుకెళ్తే..తాము భవిష్యత్ లో పొత్తులో భాగంగా పవన్ డిమాండ్ చేసిందే తాము అమలు చేయాల్సి ఉంటుందనే వాదన టీడీపీ నేతల నుంచి వినిపిస్తోంది.

Pawan Kalyan Graph in AP hijacks TDP Charishma,Was it that what YSRCP wants

టీడీపీకి గట్టి పట్టు ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో పవన్ కు వస్తున్న స్పందనతో టీడీపీ నేతలు అలర్ట్ అవుతున్నారు. కొంత కాలంగా పవన్ కల్యాణ్ కు మద్దతుగా ప్రతీ అంశంలోనూ టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతుగా నిలవటం..ట్వీట్లు చేయటం పైనా పార్టీలో చర్చ జరుగుతోంది. పొత్తు ఖరారయ్యే వరకూ సొంత బలంతోనే వైసీపీని ఎదుర్కొనే వ్యూహాలను సిద్దం చేయాల్సి న అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే రకంగా కొనసాగితే..టీడీపీ కంటే పవన్ బలమైన ప్రత్యామ్నయంగా కనిపించటం ఖాయమనే వాదన వినిపిస్తోంది. ఇదే కొనసాగితే టీడీపీకి ఇబ్బందులేననే వాదన వినిపిస్తోంది. అయితే, పవన్ మరింత దూకుడుగానే ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్న వేళ.. ఇప్పుడు టీడీపీ అధినేత ఏ వ్యూహాలతో ముందుకు వస్తారో చూడాలి.

English summary
Janasena Chief Pawan Kalayan political steps hijacks TDP Charishma in AP Politics, It may indirectly helps YSRCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X