YS Jagan-Raghurama: జగన్ తో రఘురామ చిట్ చాట్ పై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
ఏపీ అసెంబ్లీలో నిన్న ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బద్ధ శత్రువులుగా పేరున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్, టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అసెంబ్లీ సమావేశాల వేళ కలిసి మాట్లాడుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ చిట్ చాట్ చర్చనీయాంశమైంది. ఓవైపు ఇప్పటికీ జగన్ పై కేసులు పెట్టి ప్రతీకారం తీర్చుకుంటున్న రఘురామ.. మరోవైపు అసెంబ్లీలో ఆయన్ను పలకరించడంపై కూటమి పార్టీల్లోనే మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఈ ఘటనపై ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోనే స్పందించారు.
ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ నిన్న చేసిన ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. నిన్నటి రఘురామ, జగన్ ఘటనపై స్పందించారు. రఘురామను పొగడ్తల్లో ముంచెత్తుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు రఘురామ వంటి వారి నుంచి తానెంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు. ఆయన తమకు స్ఫూర్తి అన్నారు. దీంతో రఘురామ కూడా ముసిముసి నవ్వులు కురిపించారు.

తనపై గత ప్రభుత్వంపై దాడి చేసినా, కస్టడీలో పెట్టి హింసించినా నిన్న అసెంబ్లీలో కనిపించగానే జగన్ ను నవ్వుతూ రఘురామ రాజు పలకరించడాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. కూటమి అధికారంలో ఉన్నా వైసీపీ వాళ్లు తమ వారిపై దాడులు చేస్తున్నారని, అయినా తాము బలం ఉంది కదాని దాడులకు దిగొద్దని సీఎం చంద్రబాబు చెప్పిన విషయాన్ని పవన్ గుర్తుచేశారు. రఘురామ నిన్న జగన్ ను పలకరించిన తీరు కూడా ఇందుకు నిదర్శనంగా ఉందని పవన్ అభినందించారు. నిన్న అసెంబ్లీలో జగన్ ను కలిసిన రఘురామ.. ఆయన భుజంపై చేయి వేసి మాట్లాడుతూ రెగ్యులర్ గా సభకు రావాలని కోరారు.












Click it and Unblock the Notifications