పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్... చంద్రబాబు, ఎన్డీఏ ఎంపీల ముందే జనసేనానికి మోదీ కితాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సార్వత్రిక ఎన్నికలలో తమకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో శుక్రవారం ఎన్డీయే ఎంపీల సమావేశం నిర్వహించి మోదీ నాయకత్వానికి లాంఛనంగా ఆమోదముద్ర వేశారు.
మోదీనే ఎన్డీయే పక్ష నేత .. ఏకగ్రీవ తీర్మానం
ఎన్డీఏ ఎంపీల భేటీలో 270 మంది బీజేపీ ఎంపీలతో పాటు టిడిపి, జెడియు, శివసేన, లోక్ జనశక్తి, ఎన్సీపీ, జెడిఎస్, జనసేన, అప్నా దళ్ సహా ఇతర మిత్రపక్షాల ఎంపీలు, ఎన్డీఏ పక్షాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు.ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ నాయకత్వాన్ని వారంతా సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.

జనసేన అధినేత పవన్ పై మోదీ వ్యాఖ్యలు
ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవి నాకు భావోద్వేగ క్షణాలు అని పేర్కొన్న మోదీ తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ఎన్డీయే ను ఆదరించారని సంతోషం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజలు తనకు పెద్ద బహుమతి ఇచ్చారని మోదీ వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో భారీ విజయం ప్రజల ఆకాంక్షలకు అద్దం
గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్ కు అధికారం ఇచ్చినా ఇప్పుడు లోక్ సభలో ప్రజలు తమను ఆదరించారన్నారు. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడిన మోదీ ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు తుఫాన్ అంటూ పేర్కొన్నారు . ఏపీలో ఇంత భారీ విజయం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందని మోదీ కొనియాడారు.

పవన్ కళ్యాణ్ ఒక తుఫాను .. మోదీ వ్యాఖ్యలు
మన సమక్షంలో పవన్ కళ్యాణ్ ఉన్నారని ఆయన తుఫాన్ .. సునామి లాంటి వాడని చంద్రబాబు ముందే మోదీ పవన్ కళ్యాణ్ కు కితాబిచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ నవ్వుతూ మోదీకి కృతజ్ఞతా పూర్వకంగా అభివాదం చేశారు.
పవన్ కళ్యాణ్ కాదు ..తుఫాన్ - మోదీ#Modi #NarendraModi #PawanKalyan #Oneindiatelugu pic.twitter.com/c4zXYVOsMd
— oneindiatelugu (@oneindiatelugu) June 7, 2024
అందరిముందు పవన్ పై మోదీ ప్రశంసలు
ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యే అన్ని పార్టీల నేతలు ముందు ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ను కొనియాడడం ఇప్పుడు అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది. పవన్ కళ్యాణ్ పైన ప్రతి ఒక్కరిలోనూ భారీ అంచనాలకు మోదీ వ్యాఖ్యలు కూడా కారణంగా మారుతున్నాయి. మోదీ పవన్ కు ఇస్తున్న ప్రాధాన్యత నేపధ్యంలో ఏపీ వాసులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి కావాల్సినవి పవన్ సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు












Click it and Unblock the Notifications