ముద్రగడను కలవడానికి పవన్ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా..!! ఎట్టకేలకు..

రాజమండ్రి : ముద్రగడ దీక్షతో కాపులంతా ఒక్క తాటిపైకి వచ్చినా.. అదే సామాజిక వర్గానికి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించాలని ఇప్పటికే చాలామంది నేతలు మీడియా ముఖంగా పవన్ ని కోరినా.. ఆయన మాత్రం విషయంపై నోరు మెదపలేదు.

కాగా, తాజా సమాచారం ప్రకారం.. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ కాపుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ముద్రగడకు మద్దతిస్తే ఒకే సామాజిక వర్గానికి పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడుతుందోమోనని పవన్ భావిస్తున్నారన్న ఊహాగానాలకు చెక్ పెడుతూ ఆయన ముద్రగడ పద్మనాభంను కలవడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టుగా సమాచారం.

తెలియవస్తున్న సమాచారం ప్రకారం.. బుధవారం నాడు పవన్ కళ్యాణ్ ముద్రగడను కలిసే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకోసం రాజమండ్రి బయలుదేరి వెళ్లనున్న పవన్, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడను పరామర్శించినున్నారని తెలుస్తోంది.

Pawan Kalyan is going to meet Mudragada

ఇదే సందర్భంగా పవన్ కాపు నేతలతో ప్రత్యేకంగా భేటి అయ్యి ప్రస్తుత పరిస్థితులు, కాపు సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. పవన్ ముద్రగడను గనుక కలిస్తే.. ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. పవన్ కి ఉన్న భారీ ఫాలోయింగ్ నేపథ్యంలో రాజమండ్రికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+