హోదాపై తొందరపడనన్న పవన్ కళ్యాణ్‌పై రోజా తీవ్రవ్యాఖ్య, అసలేమన్నాడు?

విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రబ్బర్ సింగ్ అయ్యారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా పైన ఆయన మాట్లాడకపోవడం విడ్డూరమన్నారు. పవన్ కళ్యాణ్ హోదా విషయంలో చేతులెత్తేశారని విమర్శించారు.

మాటమార్చిన పవన్ కళ్యాణ్: బాబు దారిలో... మనసులో ఏముంది?పవన్ కళ్యాణ్ సినిమాలలో మాత్రమే గబ్బర్ సింగ్ అన్నారు. రాజకీయాల్లో రబ్బర్ సింగ్‌గా నిలిచారన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతివ్వాలని రోజా డిమాండ్ చేశారు. హోదా విషయంలో సీఎం చంద్రబాబుది ద్వంద్వ వైఖరి అన్నారు.

Roja

విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ సరికాదన్నారు. తమ జేబులు నింపుకునేందుకే ప్రత్యేక హోదా అంటున్నారని చెప్పారు. ప్యాకేజీల పేరుతో మోసం చేయడం సరికాదన్నారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అన్నారు.

కాగా, ప్రత్యేక హోదా పైన పవన్ కళ్యాణ్ శనివారంనాడు స్పందించిన విషయం తెలిసిందే. హోదా విషయమై తాను తొందరపడి మాట్లాడనని, ఇది చాలా సున్నితమైన అంశమని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. గొడవలతో సమస్యలు పరిష్కారం కావని ఆయన అభిప్రాయపడ్డారు. హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యత ఉందన్నారు.

దేవుడి నిర్ణయంతో ఏపీలో పవన్ కళ్యాణ్ ముందడుగు: కలయిక వెనుక ఆ రెండు!హోదా కోసం ప్రజాప్రతినిధులు అందరు కలిసి పోరాడాలన్నారు. దీనిపై ఆవేశంతో మాట్లాడలేమన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు పోరాడాలని, వారితో కానిది తన వల్ల అవుతుందా అన్నారు. హోదాపై అనాలోచితింగా మాట్లాడానని చెప్పారు. కేంద్రం హోదా ఇవ్వమని స్పష్టంగా చెప్పినప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పారు. సమస్య పరిష్కార దిశగా చర్చలు ఉండాలన్నారు. కేంద్రం ఇవ్వనంటే అప్పుడు చూద్దామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+