వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మహత్యలకు పాల్పడిన కౌలురైతుల కుటుంబాలకు అండగా.. ఉగాదినాడు పవన్ కళ్యాణ్ కీలకప్రకటన!!

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభకృత్ నామ ఉగాది పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా, ఉగాది పండుగ రోజున రైతు సమస్యల పట్ల స్పందించారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అండగా ఉంటానని ప్రకటించారు.

ఉగాది వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ దంపతులు; గవర్నర్ తో పాటు ప్రముఖుల శుభాకాంక్షలుఉగాది వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ దంపతులు; గవర్నర్ తో పాటు ప్రముఖుల శుభాకాంక్షలు

 ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు అండగా పవన్ కళ్యాణ్ ప్రకటన

ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు అండగా పవన్ కళ్యాణ్ ప్రకటన


ప్రకృతి విపత్తుల నుంచి, ప్రభుత్వ వైఫల్యాల వరకు రాష్ట్రంలో సమస్య ఏదైనా జనం కోసం నేనున్నాను అంటూ ముందుకు నడిచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలపై ఉగాది పండుగ రోజున ప్రకటన చేశారు. ప్రస్తుతం మనం రోజూ తినే తిండి గింజలలో 80 శాతం కౌలు రైతుల కాయకష్టం వల్ల పండినవే అని పేర్కొన్న పవన్ కళ్యాణ్ అటువంటి కౌలు రైతుల బాధలు తెలుసుకుంటే హృదయం ద్రవిస్తుందన్నారు.

కౌలు రైతులు అప్పుల బాధలతో ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరం అన్న పవన్ కళ్యాణ్

కౌలు రైతులు అప్పుల బాధలతో ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరం అన్న పవన్ కళ్యాణ్


ఏపీలో రైతులు,కౌలు రైతుల పంట నష్టాలు అప్పుల భారంతో ఆత్మహత్యలకు పాల్పడడం అత్యంత బాధాకరమని పేర్కొన్న పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలలోనే 80 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అంటూ వెల్లడించారు. కౌలు రైతులకు నిబంధనల పేరుతో ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. సాగు చేసుకోవడానికి రుణాలను ఇవ్వటం లేదని, పంట నష్టపోతే పంట నష్టపరిహారాన్ని కూడా ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేశారు.

మరణించిన కౌలు రైతుల కుటుంబాలకు ఊరట నిచ్చేలా జనసేన పక్షాన ఆర్ధిక సాయం

మరణించిన కౌలు రైతుల కుటుంబాలకు ఊరట నిచ్చేలా జనసేన పక్షాన ఆర్ధిక సాయం


ఇక ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతులకు ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్థిక సహాయం అందడం లేదని పేర్కొన్న పవన్ కళ్యాణ్, కనీసం అధికారులు కూడా పరామర్శించడం లేదని విచారం వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది అన్న పవన్ కళ్యాణ్ ఉగాది పూట ఆ కుటుంబాల దుఃఖంతో ఉండకూడదని, వారికి కొంతైనా ఊరట ఇవ్వాలన్న ఉద్దేశంతో జనసేన పక్షాన వారికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు.

ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సాయం

ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సాయం


ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలలో ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున అప్పుల భారంతో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు జనసేన ఆర్థిక సహాయం చేస్తుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలలో పిల్లల చదువులకు, ఇతర అవసరాలకు కొంతైనా సహాయం అందించాలనే ఉద్దేశంతో లక్ష రూపాయలు సహాయం ప్రకటిస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. త్వరలోనే ప్రతి కుటుంబాన్ని పరామర్శిస్తానని, ఆర్థిక సహాయం అందించే ప్రక్రియ కూడా ప్రారంభిస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. జనసేన పార్టీ రైతులు, కౌలు రైతుల పక్షాన నిలుస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

English summary
On ugadi, Janasena chief Pawan Kalyan has made a key announcement that he will provide financial assistance of Rs 1lakh to the families of tenant farmers who have committed suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X