• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దిశ చట్టం.. కొత్త చట్టాలతో ఉపయోగం ఏంటి: వివేకా హత్య కేసులోనూ 21రోజల్లోనే చేయచ్చుగా: పవన్

|

ఏపీ ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో ఆమోదించిన దిశ చట్టం పైన జనసేన అధినేత పవన్ కళ్యాన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన ఒక వైపు దిశ చట్టం మంచిదే..అని చెబుతూనే..ఇదే రకంగా వివేకా హత్య కేసు లోనూ దోషులెవరో తేల్చి.. ఇలాగే 21 పని దినాల్లో పరిష్కారం చేసి.. శిక్షించవచ్చు కదా అని ప్రశ్నించారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.

ఆడవారి భద్రత కోసం చేపట్టే ఏ చర్య అయినా.. మంచిదే అంటూనే ..ఉన్న చట్టాలను అమలు చేయకుండా కొత్త చట్టాలంటే ఉపయోగం ఏముంటుందని ప్రశ్నించారు. ఇక,ఏ సైద్ధాంతిక భూమికతో సి.పి.ఐ. కూడా ఒకప్పుడు బి.జె.పి.తో కలసి ఎన్నికలకు వెళ్ళింది అని పవన్ ప్రశ్నించారు. కమ్యూనిస్టులతో కాకుండా బీజేపీతో కలిసి వెళ్తున్నారనే ప్రశ్న పైన పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు కారణమయ్యాయి.

దిశ చట్టం మంచిదే..వివేకా హత్య కేసులోనూ 21 రోజులకే

దిశ చట్టం మంచిదే..వివేకా హత్య కేసులోనూ 21 రోజులకే

ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన దిశ-2019 చట్టం పైన జనసేన అధినేత పవన్ స్పందించారు. ఆడవారి భద్రత కోసం చేపట్టే ఏ చర్య అయినా మంచిదే అంటూ చెబుతూ.. ఉన్న చట్టాలను సరిగ్గా అమలు చేయకుండా కొత్త చట్టాలంటే ఉపయోగం ఏముంటుందని ప్రశ్నించారు.అదే సమయంలో ఆయన బాబాయ్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కానీ, అలాగే విశాఖపట్నం విమానాశ్రయంలో తనపై కత్తితో దాడి కేసులో కానీ దోషులెవరో తేల్చి, ఇలాగే 21 పని దినాల్లో పరిష్కారం చేసి.. శిక్షించవచ్చు కదా ..అంటూ వ్యాఖ్యానించారు.

అధికారంలోకి రాక ముందు వాటి గురించి ఆవేశంగా ఎంతో మాట్లాడినవాళ్ళు... ఇప్పుడు తమ చేతిలోనే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకని దోషులెవరో తేల్చి, శిక్షించడం లేదంటూ పవన కళ్యాణ్ నిలదీసారు. వీటిని జనం తరపున అడగాల్సి వస్తుందని..అడుతామని స్పష్టం చేసారు.

ఆటవిక న్యాయం కాదు..చట్ట బద్దం చేయండి..

ఆటవిక న్యాయం కాదు..చట్ట బద్దం చేయండి..

దిశ లాంటి ఘటనలు జరగకుండా చట్టాలను కట్టుదిట్టం చేయాలని పవన్ కోరారు. అన్నింటికీ ప్రతీకార ధోరణి పరిష్కారం కాదనే అభిప్రాయం వ్యక్తం చేసారు. తప్పు చేసినవాణ్ణి చంపేయచ్చు.. నరికేయవచ్చు అని అంటున్నామని.. అన్నింటికీ ప్రతీకార ధోరణి పరిష్కారం కాదని చెప్పుకొచ్చారు. అలా ఆటవిక న్యాయం బదులు సింగపూర్‌లో, దుబాయ్‌లో లాగా అలాంటి కఠినమైన దండనల్ని చట్టబద్ధం చేయండి అనేది తన వాదన గా చెప్పుకొచ్చారు.

తప్పు చేయాలంటే.. భయపడే విధంగా బహిరంగంగానే శిక్షించే చట్టం తీసుకురావాలని సూచించారు. అయినా, కులం, వర్గం, సామాజిక స్థాయి లాంటి అంశాలను బట్టి స్పందిం చడం కాదని... అందరికీ స్పందించాలిని పవన్ అభిప్రాయపడ్డారు. మన దృష్టిలో పడని నిర్భయ .., దిశ వంటి వ్యవహారాలు లు ఎన్నో ఉన్నాయని.. కదిరి లాంటి ప్రాంతాల్లో ఇలాంటివెన్నో జరుగుతున్నా ఎవరూ మాట్లాడడానికి ఇష్టపడరని వ్యాఖ్యానించారు. ఏ కేసులూ ఉండవు.. అందుకే, చట్టబద్ధంగా శిక్షలు బహిరంగంగా విధిస్తే.. దాని శక్తి, ప్రభావం తెలుస్తాయని చెప్పుకొచ్చారు.

సీపీఐ ఒకప్పుడు బీజేపీతో కలిసి ఎన్నికల్లో

సీపీఐ ఒకప్పుడు బీజేపీతో కలిసి ఎన్నికల్లో

పవన్ కళ్యాన్ తాను వామపక్షాలకు దూరం అవుతున్నారనే వ్యాఖ్యల మీద స్పందించారు. తనకు ఏ ఇజమూ లేదని..మద్రాసులో ఉండే రోజుల్లో మా దగ్గరకు వామపక్ష బృందాల వాళ్ళు సహాయం కోసం వచ్చి అడిగితే, చేసిన సందర్భాలూ అనేకం ఉన్నాయన్నారు. తనది లెఫ్టు వింగ్‌ ఐడియాలజీ కాదని... అలాగని రైట్‌ వింగ్‌ ఐడియాలజీ కూడా కాదని స్పష్టం చేసారు.అయినా గత చరిత్ర ఆధారంగా మాట వరసకు అనా లంటే, ఏ సైద్ధాంతిక భూమికతో సిపిఐ కూడా ఒకప్పుడు బిజెపి తో కలసి ఎన్నికలకు వెళ్ళిందని పవన్ నవ్వుతూ ప్రశ్నించారు. తమాషాగా చెప్పాలంటే ఈ విషయంలో సిపిఐ యే తనకు ఆదర్శం అనుకోవచ్చుగా

అంటూ పవన్ వ్యాఖ్యానించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Janasena chief pawan Kalyan key comments on Disha act which approved in AP Assembly. Pawan ask why not punish accused persons in Viveka's murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more