జగన్ గెలిస్తే దారుణమే, బెదిరించారు: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ఎన్నుకుంటే పరిస్థితులు దారుణంగా ఉంటాయని జనసేన అధిపతి, తెలుగు సినీ హీరో పవన్ కల్యాణ్ ప్రజలను హెచ్చరించారు. ఎంత దారుణంగా ఉంటాయంటే వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నప్పటి కన్నా దారుణంగా ఉంటాయన్నారు. వైఎస్ పాలనలో ఎలాంటి పరిస్థితులున్నాయో కూడా ఆయన వివరించారు.
వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో ధనవంతులు బలవంతులుగా మారారని తెలిపారు. చివరికి, తనను కూడా బలవంతంగా ఒక సినిమా చేయాలంటూ బెదిరించారని పవన్ కల్యాణ్ చెప్పారు. వైయస్ హయాంలో ధనవంతులు బలవంతులుగా మారారని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ పేరిట 'జనసేన' ఫేస్‌బుక్, ట్విటర్‌లలో ప్రకటన కనిపించింది.

పవన్ కళ్యాణ్ స్సష్టంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యం చేసుకుని ఉంటారని తెలుస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ 'కాంగ్రెస్ హటావో' అని పిలుపు ఇచ్చారు. ఇతర పార్టీలపై ఎలాంటి విమర్శలు చేయలేదు. ఆ తర్వాత బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసి ఆయనకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభలో మోడీ ప్రధాని కావాలని బలంగా ఆకాంక్షించారు. ఆ తర్వాత ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మొట్టమొదటిసారిగా జగన్, వైఎస్‌లపై విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications