Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్-లక్ష్మీపార్వతి వ్యాఖ్య: జూ.ఎన్టీఆర్ వస్తే, చంద్రబాబుకు అంతుందా!?

Recommended Video

    టిడిపి పగ్గాలు నందమూరి ఫ్యామిలీకి ఇవ్వాలి: పవన్-లక్ష్మీపార్వతి

    అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి తెలుగుదేశం పార్టీపై కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు, టీడీపీ - కాంగ్రెస్ పార్టీల దోస్తీపై ఊహాగానాల నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లలో ఆసక్తికర చర్చ సాగుతోందట. టీడీపీపై విమర్శలో భాగంగా పవన్, లక్ష్మీపార్వతిలు చంద్రబాబుపై మండిపడ్డారు.

    ఇందులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌లు సొంతగా పార్టీ పెట్టి ఈ స్థాయికి తీసుకు వచ్చారని, చంద్రబాబుకు అంత ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ముంటే టీడీపీని వీడి కొత్తగా పార్టీ స్థాపించి, ఈ స్థాయికి తీసుకురాగలరా అని అభిప్రాయపడ్డారు.

    నందమూరి ఫ్యామిలీకి అప్పగిస్తే..

    నందమూరి ఫ్యామిలీకి అప్పగిస్తే..

    ఇవే వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు తమ్ముళ్లతో పాటు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోందట. కాంగ్రెస్ -తెలుగుదేశం పార్టీ పొత్తు ప్రచారం నేపథ్యంలో సరదాగా ఈ చర్చ సాగుతోందట. టీడీపీని నందమూరి ఫ్యామిలికీ అప్పగిస్తే చంద్రబాబుకు అంతుందా అని చర్చించుకుంటున్నారట.

    చంద్రబాబుపై ఆగ్రహం

    చంద్రబాబుపై ఆగ్రహం

    తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించారని, దానిని చంద్రబాబు నాయుడు వెన్నుపోటుతో ఆక్రమించారని, దానిని తిరిగి నందమూరి ఫ్యామిలీకి అప్పగించాలని టీడీపీ అధినేతను వ్యతిరేకించే నేతలు డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే.

     బాలకృష్ణ, జూ ఎన్టీఆర్‌కు అప్పగించాలని

    బాలకృష్ణ, జూ ఎన్టీఆర్‌కు అప్పగించాలని

    లక్ష్మీపార్వతి వంటి వారు అయితే మరో అడుగు ముందుకు వేసి టీడీపీని జూనియర్ ఎన్టీఆర్ లేదా బాలకృష్ణలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆ పార్టీ అధినేతగా ఉంటే అది ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీగా పరిగణించమని కూడా చెప్పే వాళ్లు ఉన్నారు.

    పొత్తు ప్రచారం

    పొత్తు ప్రచారం

    పవన్, లక్ష్మీపార్వతిల విమర్శల అనంతరం తాజాగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం సాగుతోంది. దీనిని రెండు పార్టీల నేతలు ఖండిస్తున్నారు. అదే సమయంలో ఆ పార్టీల నేతల మాటలు కూడా అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయి. చంద్రబాబు అలా చేయరని, ఒకవేళ అలా చేస్తే అంతకంటే దుర్మార్గం ఉండదని, తాము పార్టీని వీడుతామని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోను వారసత్వంపై జనసేనాని, తదితరులు అన్న విషయంపై సరదాగా చర్చ సాగుతోందట. చంద్రబాబు టీడీపీని వీడి సొంతపార్టీ పెడితే, జగన్, కేసీఆర్‌లా నెగ్గుకు రాలేరనేది కొందరి వాదన. టీడీపీకి ఉన్న పునాదుల కారణంగానే పార్టీ అధినేత పటిష్టంగా కనబుడుతున్నారని అంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+