అనంతపురం నుంచి పోటీ: ఆ 3 నియోజకవర్గాలపైనే కన్నేసిన పవన్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి తాను పోటీ చేస్తానని జనసేన పార్టీ అధినేత వపన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జిల్లాలోని ఏ నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే అంశంపై జిల్లాలో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, నేతల్లో ఉత్కంఠ నెలకొంది.

కదిరా లేదా గుంతకల్లు

కదిరా లేదా గుంతకల్లు

అయితే, కదిరి నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేసే అవకాశాలున్నాయని ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ నేత ఒకరు చెబుతున్నారు. గుంతకల్లు నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు. పవన్ దృష్టి కూడా ఈ నియోజకవర్గంపైనే ఉందని వార్తలు కూడా వస్తున్నాయి.

అనంతపురంపైనా కన్నేశాడు

అనంతపురంపైనా కన్నేశాడు

కాగా, ఈ రెండు నియోజకవర్గాల్లోనూ పవన్ కళ్యాణ అభిమానులు భారీగా ఉండటంతో జనసేన కూడా ఈ రెండింటిపైనే పూర్తిగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇది ఇలావుంటే, అనంతపురం నియోజకవర్గం నుంచి తాను బరిలోకి దిగితే ఎలా ఉంటుందనే విషయాన్ని పవన్ తన సన్నహితుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం.

మరికొంత కాలం ఆగాల్సిందే..

మరికొంత కాలం ఆగాల్సిందే..

ఏదేమైనా పవన్ పోటీ చేసే నియోజకవర్గంపై స్పష్టత రావాలంటే మరింత సమయం ఆగాల్సిందే. అయితే, పవన్ కళ్యాణ్ అనంతపురంలోని ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా గెలుపు ఖాయమని జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు అభిమానులు పేర్కొంటున్నారు.

పార్టీ సేవల కోసం అర్హులను ఎంపిక చేస్తాం: పవన్

పార్టీ సేవల కోసం అర్హులను ఎంపిక చేస్తాం: పవన్

శ్రీకాకుళంలో జనసేప పార్టీ కోసం బుధవారం ఎంపికలు జరుగుతున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఎంపికల్లో యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారని, పార్టీ సేవల కోసం అర్హులను ఎంపిక చేస్తామని అన్నారు. తమకు అందిన అన్ని దరఖాస్తులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. విజయనగరం నుంచి జనసేనకు వచ్చిన దరఖాస్తుల వివరాలను పవన్ వెల్లడించారు. మొత్తం 2వేల దరఖాస్తులు వచ్చాయని అన్నారు. మే 20, 21న విజయనగరంలోనూ జనసేన శిబిరం ఉంటుందని తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Janasena chief Pawan Kalyan likely to contest from Anantapur or kadiri or Guntakallu.
Please Wait while comments are loading...