అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఎన్డీఏ కీలక సమావేశం తర్వాత ఢిల్లీలోనే ఉన్న పవన్ కళ్యాణ్.. బుధవారం అమిత్ షాను కలిశారు. ఆయనతోపాటు జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా ఈ భేటీలో ఉన్నారు. దాదాపు 25 నిమిషాలపాటు పవన్, అమిత్ షా సమావేశం జరిగింది.
అమిత్ షాతో సమావేశం అద్భుతంగా జరిగిందని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా భేటీకి సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. తమ చర్చలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రగతికి దోహదం చేస్తాయని అన్నారు. ఏపీ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక సుసంపన్నమైన భవిష్యత్ అందించేందుకు ఈ చర్చలు దోహదపడతాయని పవన్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ, జనసేన కూటమి బలోపేతంపై చర్చించామని బీజేపీ నేత మురళీధరన్ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. అమిత్ షా కన్నా ముందు పవన్, మనోహర్.. కేంద్రమంత్రి, ఏపీ బీజేపీ ఇంఛార్జ్ మురళీధరన్‌ను కలిశారు.
Had an excellent meeting with Hon’ble Minister for Home ‘Sri Amit Shah ji’. And I am sure this interaction will lead to a constructive, decisive and prosperous future for the people of Andhra Pradesh ! @AmitShah @JanaSenaParty @mnadendla pic.twitter.com/oMLXajQ1L1
— Pawan Kalyan (@PawanKalyan) July 19, 2023
వచ్చే ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచనప్రాయంగా తెలిపారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందన్న పవన్.. జగన్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి అందరూ కలిసి పోరాడాలని పేర్కొన్నారు.
కాగా, బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో కాకుండా జనసేనతో మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, పవన్ కళ్యాణ్ మాత్రం మరోసారి ఓట్లను చీల్చి వైసీపీని గెలిపించడం ఇష్టం లేదని అంటున్నారు. అందుకే పొత్తుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇటు బీజేపీ, అటు టీడీపీతో కలిసి పోటీ చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఖాయమని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీతో కూడా పొత్తుపై బీజేపీ నేతలు కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
-
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
డీలిమిటేషన్ పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?











Click it and Unblock the Notifications